E-Paper
Advertisement

IPL 2026: నేడు RCB, SRH మ్యాచ్ కు వ‌ర్షం అడ్డంకి? 300 కొడ‌తామ‌ని ఇషాన్ కిష‌న్‌ వార్నింగ్

IPL 2026:  నేడు RCB, SRH మ్యాచ్ కు వ‌ర్షం అడ్డంకి? 300 కొడ‌తామ‌ని ఇషాన్ కిష‌న్‌ వార్నింగ్
Advertisement

IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ( Indian Premier League 2026 ) టోర్నమెంట్ ఇవాళ ప్రారంభం కానుంది. మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతున్న ఈ టోర్నమెంట్ సందర్భంగా తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల ( Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad) మధ్య జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. చిన్నస్వామి స్టేడియం ( M.Chinnaswamy Stadium, Bengaluru ) వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు దారి చేసింది. బెంగళూరులో ఇవాళ ఉదయం నుంచి ఎండ దంచి కొట్టినప్పటికీ సాయంత్రం వరకు వాతావరణం చల్లబడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మ్యాచ్ ప్రారంభ సమయానికి 50 నుంచి 60 శాతం వరకు వర్షం ( Rain alert) పడే ప్రమాదమే పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఐపీఎల్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Also Read: Shahid Afridi On PSL: ఛీ..ఛీ పింక్ బంతులు వాడ‌టం ఏంట్రా…PSL కంటే గ‌ల్లీ క్రికెట్ న‌యం, కేబుల్ టీవీ ప్ర‌సారాల కంటే దారుణం

నేడు RCB, SRH మ్యాచ్ కు వ‌ర్షం అడ్డంకి?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఇవాళ షురూ అవుతుంది. ఓపెనింగ్ సెర్మని లేకుండానే తొలి మ్యాచ్ జరగనుంది. ఈ తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ఉండగా, ఏడున్నర గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 50 నుంచి 60 శాతం వర్షం పడే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వర్షం కొద్దిసేపు పడిన తర్వాత ఆగిపోయే ఛాన్సు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ సిస్టం ఉన్న నేపథ్యంలో మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచిన.. ఆ తర్వాత ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు రికార్డులు

సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇప్పటివరకు 25 మ్యాచ్లు జరిగాయి. ఇందులో రెండు పోటా పోటీగా నిలిచినప్పటికీ… సన్రైజర్స్ హైదరాబాద్ 13 విజయాలు నమోదు చేసుకుంది. అటు బెంగళూరు కేవలం 11 మ్యాచ్లో విజయం సాధించింది. అయితే బెంగళూరు పైన సన్రైజర్స్ 287 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. బెంగుళూరు బౌలర్లను చీల్చి చెండాడడంలో హైదరాబాద్ బ్యాటర్లు ఎప్పుడు ముందుంటారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ ఈ మ్యాచ్ లో సెంచరీ చేసే ప్రమాదం కూడా ఉంది. అటు హైదరాబాద్ చేతిలో 68 పరుగులకే ఆల్ అవుట్ అయిన చెత్త రికార్డు కూడా బెంగళూరుకు ఉంది. కానీ 18వ సీజన్ టైటిల్ గెలిచిన బెంగుళూరు, తన హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి లో మొదటి మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అంటున్నారు అభిమానులు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి. అటు ఇవాళ్టి మ్యాచ్ లో 300 కొడ‌తామ‌ని ఇషాన్ కిష‌న్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: DK Shivakumar On IPL Tickets: ఐపీఎల్ లో కొత్త పంచాయ‌తీ, ప్ర‌తి ఎమ్మెల్యేకు 4 VIP టికెట్లు..? డీకే శివ కుమార్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×