E-Paper
Advertisement

Crime Thriller OTT : పోలీసులకు చుక్కలు చూపించే మొండెం లేని తల… ఏడు భాషల్లో విజయ్ సేతుపతి కొత్త సిరీస్

Crime Thriller OTT : పోలీసులకు చుక్కలు చూపించే మొండెం లేని తల… ఏడు భాషల్లో విజయ్ సేతుపతి కొత్త సిరీస్
Advertisement

Crime Thriller OTT : విజయ్ సేతుపతికి తమిళంలో ఎంత క్రేజ్ ఉందో తెలుగులోనూ అంతకంటే ఎక్కువే ఉంది. ఈ నటుడి నటనకు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. ఈ హీరో ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘కాట్టాన్’ (Kaattaan)ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ సిరీస్ ట్రైలర్ తోనే హడలెత్తించేసింది. బాడి లేని తల పోలీసులకు దొరకడంతో ఈ స్టోరీ క్రేజీగా మొదలవుతుంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

‘కాట్టాన్’ (Kaattaan) సిరీస్‌కు నేషనల్ అవార్డ్ విన్నర్ మణికందన్ దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సేతుపతితో పాటు మిలింద్ సోమన్, సుదేవ్ నాయర్, సింగం పులి, వడివేలు మురుగన్, రిష జాకబ్స్, ముత్తు కుమార్, కళైవాణి భాస్కర్, వీజే పారు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్ జియో హాట్ స్టార్‌ (Jio hotstar)లో మొత్తం 10 ఎపిసోడ్స్ తో మార్చి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ తమిళం కాగా… తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాళీ, మరాఠీ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. దీనిని విజయ్ సేతుపతి తన సొంత బ్యానర్ లోనే నిర్మించడం విశేషం.

స్టోరీ ఏంటంటే?

Advertisement

ఒక కొండప్రాంతంలో ఉండే ఊరిలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ గొడవలే లేవని పోలీసులు ఖాళీగా ఉండటంతో, ఇక ఆ పోలీస్ స్టేషన్ ఎత్తేయాలి అనుకుంటూ ఉంటారు. ఇదే టైంలో పోలీసులకు ఒకడి తెగిపడిన తల దొరుకుతుంది. ఆ తల ఎవరిది అని ఆరా తీస్తే, అది ముత్తు అనే కిరాతకుడిది అని కొందరు, వాడు అసలు దేవుడి లాంటివాడని మరికొందరు రకరకాలుగా చెబుతుంటారు. అస్సలు ఎవరీ ముత్తు? వాడు మంచోడా లేక క్రిమినలా ? వాడిని అంత దారుణంగా నరికింది ఎవరు? అనేదే ఈ కథలో అసలైన సస్పెన్స్. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ముగ్గురు పోలీసులు ఆ ముత్తు గతాన్ని తవ్వుతుంటే, ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో షాకింగ్ విషయం బయట పడుతుంటుంది.

Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న అనిర్బన్ చక్రవర్తి డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×