Blessing Muzarabani: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో PCB షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం ఒప్పందం కుదుర్చుకొని ఐపీఎల్లోకి వెళ్లినందుకు గాను జింబాబ్వే ఆటగాడు బ్లెస్సింగ్ ముజారాబానిపైన ( Blessing Muzarabani ) రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది బోర్డు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. అయితే తాజాగా ఈ వివాదంపై స్వయంగా బ్లెస్సింగ్ ముజారాబాని ఏజెంట్ స్పందించాడు. ఆ ఏజెంట్ నివేదిక ప్రకారం.. రెండు సంవత్సరాల పాటు వేసిన బ్యాన్, బ్లెస్సింగ్ ముజారాబాని వర్తించ బోదని తెలుస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఏ జట్టుతో కూడా బ్లెస్సింగ్ ఒప్పందం కుదుర్చుకోలేదట. ఒప్పందం కుదుర్చుకోక ముందే ఐపీఎల్ టోర్నమెంట్లో అవకాశం వస్తే, బ్లెస్సింగ్ ముజారాబాని జంప్ అయ్యాడని ఏజెంట్ ( Blessing Muzarabani Agent ) వెల్లడించారు. ఈ లెక్క ప్రకారం అతనిపై రెండు సంవత్సరాల పీసీబీ వేసిన బ్యాన్ ఎలా చెల్లుబాటు అవుతుందని ఏజెంట్ స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇస్లామాబాద్ యునైటెడ్ క్రికెట్ టీం (islamabad united
Cricket Team) యాజమాన్యంతో బ్లెస్సింగ్ ముజారాబాని ఒప్పందం కుదుర్చుకున్నాడని.. కానీ ఐపీఎల్ లో ఆఫర్ రావడంతో మధ్యలో వదిలి వెళ్లాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆరోపణలు చేస్తోంది. ఇందులో భాగంగానే PSL ఆడకుండా రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధించింది. అయితే దీనిపై బ్లెస్సింగ్ ముజారాబాని ఏజెంట్ క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్ క్రికెట్ జట్టుకు సంబంధించిన యాజమాన్యంతో బ్లెస్సింగ్ ముజారాబానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు.
ఆ జట్టుతో ఒప్పందం కూడా చేసుకోలేదన్నారు. ఏ ఒక్క పేపర్ పైన సంతకం చేయలేదని… అయినప్పటికీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏజెంట్. అలాగే ఐపీఎల్ లోకి వెళ్లినందుకు గాను బ్యాన్ విధించారని మండిపడ్డారు. ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుతో ఎలాంటి ఒప్పందం జరగక ముందే కేకేఆర్ నుంచి ఆఫర్ వచ్చినట్లు స్పష్టం చేశారు. అలాంటప్పుడు బ్లెస్సింగ్ ముజారాబాని పైన ఎలా బ్యాన్ విధిస్తారని నిలదీశారు. వెంటనే ఆ నిషేధాన్ని ఉపసంహరించుకొని… బ్లెస్సింగ్ ముజారాబానికి క్షమాపణలు చెప్పాలని పాకిస్తాన్ పరువు తీశారు ఏజెంట్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన బ్లెస్సింగ్ ముజారాబాని ఏజెంట్ తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా PCB బోర్డు పరువు గంగలో కలిసింది. దీనిపై ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.
Also Read: Tanveer Ahemed: గిల్ బ్యాట్లలో రబ్బర్లు…అందుకే అవలీలగా సిక్సులు, బౌండరీలు కొడుతున్నాడు
🚨 BLESSINGS MUZRABANI AGENT EXPOSED FRAUD PAKISTANI 🚨
– Blessing Muzarabani’s agent stated that Islamabad United announced his signing without any official contract. When Blessing Muzarabani was approached by Kolkata Knight Riders, he had not received any contract from… pic.twitter.com/5JwSYW3n9k
— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 19, 2026