Tanveer Ahmed: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament ) చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు లేనప్పటికీ ఈ టోర్నమెంట్ లో భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి. టీవీల్లో చూసిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా తాజాగా పెషావర్ జల్మీ వర్సెస్ క్వెట్టా గ్లాడియేటర్స్ ( Peshawar Zalmi vs Quetta Gladiators) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో పెషావర్ జల్మీ 118 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే ఇందులో బాబర్ ఆజం సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. 52 బంతులలో సెంచరీ చేసిన బాబర్ ఆజంను మెచ్చుకుంటూ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబర్ ఆజం కొట్టిన సెంచరీ అలాగే స్ట్రైక్ రేట్ చూసి, విరాట్ కోహ్లీ ( Virat Kohli) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: Tanveer Ahemed: గిల్ బ్యాట్లలో రబ్బర్లు…అందుకే అవలీలగా సిక్సులు, బౌండరీలు కొడుతున్నాడు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పెషావర్ జల్మీ వర్సెస్ క్వెట్టా గ్లాడియేటర్స్ ( Peshawar Zalmi vs Quetta Gladiators) మధ్య 29వ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియం ( National Stadium, Karachi) వేదికగా జరిగింది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ మూడు వికెట్ల నష్టానికి 25 5 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో క్వెట్టా గ్లాడియేటర్స్ 18.1 ఓవర్స్ లో 137 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. దీంతో క్వెట్టా గ్లాడియేటర్స్ పైన 118 పరుగులు తేడాతో విక్టరీ అందుకుంది పెషావర్ జల్మీ. ఇందులో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజం 52 బంతుల్లో సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇందులో 4 సిక్సర్లు అలాగే ఆరు బౌండరీలు ఉన్నాయి. 192.31 స్ట్రైక్ రేటుతో ఇరగదీశాడు బాబర్ ఆజం. దీంతో సోషల్ మీడియాలో బాబర్ ఆజం గురించే చర్చ జరుగుతోంది.
పాకిస్తాన్ సూపర్ లీక్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament ) సందర్భంగా సెంచరీ నమోదు చేసిన బాబర్ ఆజం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. ఇలాంటి సెంచరీలు ముందు నుంచి చేస్తే బాబర్ ఆజం ఎక్కడో ఉండేవాడని వెల్లడించారు. కానీ ఇప్పటికైనా మంచి ఫామ్ లోకి బాబర్ వచ్చాడని కొనియాడారు. ఇక బాబర్ ఆజం చేసే సెంచరీలు, స్ట్రైక్ రేట్ చూసి విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20లను విరాట్ కోహ్లీలాగా బాబర్ ఆజం ఆడబోడని, హిట్టింగ్ మాత్రమే ఆడతాడంటూ చురకలు అంటించారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==