E-Paper
Advertisement

Boxing Day : క్రికెట్ హిస్ట‌రీలోనే బిగ్గెస్ట్ డే.. ఒకే రోజు 29 మ్యాచ్‌లు..!

Boxing Day : క్రికెట్ హిస్ట‌రీలోనే బిగ్గెస్ట్ డే.. ఒకే రోజు 29 మ్యాచ్‌లు..!
Advertisement

Boxing Day : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులకు డిసెంబర్ 26 అంటే అది ఒక పండుగ రోజు అనే చెబుతారు. అందుకే దీనిని బాక్సింగ్ డే అని కూడా పిలుస్తారు. క్రిస్మస్ పండుగ‌ మరుసటి రోజున జరిగే ఈ మ్యాచ్‌లకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ ఏడాది బాక్సింగ్ డే రోజున ఏకంగా 29 క్రికెట్ మ్యాచ్‌లు జరగబోతుండటం విశేషం. కేవలం మ్యాచ్‌లే కాదు, సుమారు రూ. 38 కోట్ల భారీ ప్రైజ్ మనీ కలిగిన ఒక లీగ్ కూడా ఈ రోజే ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా గడ్డ నుంచి భారత్ వ‌ర‌కు ఈ రోజంతా క్రికెట్ విందు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Also Read : England cricketers: పీకల దాకా తాగి దొరికిపోయిన క్రికెటర్లు.. ఇంగ్లాండ్ బోర్డు సంచలన నిర్ణయం

బాక్సింగ్ డే ప్ర‌త్యేక‌త ఇదే..!

Advertisement

చాలా మంది ఇది బాక్సింగ్ క్రీడకు సంబంధించింది అనుకుంటారు. కానీ అది పొర‌పాటు. క్రిస్మస్ పండుగ త‌రువాత రోజున పేదలకు బహుమతులు (Boxes) ఇచ్చే సంప్రదాయం నుంచి ఈ పేరు వచ్చింది. బ్రిటన్, కామన్వెల్త్ దేశాలైన ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలో ఇవాళ‌ పబ్లిక్ హాలిడే. క్రికెట్ ప్రపంచంలో బాక్సింగ్ డే అంటే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే టెస్ట్ మ్యాచ్‌ ప్రధాన ఆకర్షణ. ఈసారి అక్కడ ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ (ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్) నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా 3-0తో సిరీస్ గెలిచినప్పటికీ, మెల్‌బోర్న్ మైదానంలో లక్ష మంది ప్రేక్షకుల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.

రూ.38 కోట్ల ప్రైజ్ మ‌నీ..!

2025 బాక్సింగ్ డే రోజున భారత పురుషుల జట్టుకు మ్యాచ్ లేకపోయినా.. మ‌హిళా క్రికెటర్లు రంగంలోకి దిగుతున్నారు. తిరువనంతపురంలో భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఇండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. క్లీన్ స్వీప్ లక్ష్యంతో హర్మన్‌ప్రీత్ సేన ఈ పవిత్రమైన రోజున మైదానంలోకి అడుగుపెట్టనుంది. మరోవైపు భారత్‌లో జరుగుతున్న డొమెస్టిక్ వన్డే టోర్నమెంట్‌లో కూడా ఏకంగా 19 మ్యాచ్‌లు ఇవాళ‌ జరగబోతున్నాయి. అంటే దేశంలోని ప్రతి మూలన‌ క్రికెట్ సందడి నెలకొనబోతోంది. ఈ రోజు మరో రెండు ప్రధాన టీ20 లీగ్‌లు కూడా ప్రారంభం కాబోతున్నాయి. సౌతాఫ్రికాలో SA20 లీగ్ మొదలవుతోంది. ఈ లీగ్ మొత్తం ప్రైజ్ మనీ సుమారు రూ.38 కోట్లు.. గెలిచిన జట్టుకు రూ.16.5 కోట్లు, రన్నరప్‌కు రూ.8 కోట్లు లభిస్తాయి. మొదటి రోజే ఎంఐ కేప్ టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఇక‌ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కూడా ఈ రోజే ప్రారంభమవుతోంది. సిల్హెట్‌లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇవే కాకుండా ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ డబుల్ హెడర్ మ్యాచ్‌లు, న్యూజిలాండ్‌లో సూపర్ స్మాష్ లీగ్, యూఏఈలో ఐఎల్ టీ20 మ్యాచ్‌లు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి.

Advertisement

Also Read : INDW Vs SLW : నేడు భార‌త్-శ్రీలంక మ‌ధ్య మూడో టీ20.. సిరీస్ ప‌ట్టేయాల‌ని..!

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×