E-Paper
Advertisement

england cricketers: పీకల దాకా తాగి దొరికిపోయిన క్రికెటర్లు.. ఇంగ్లాండ్ బోర్డు సంచలన నిర్ణయం

england cricketers: పీకల దాకా తాగి దొరికిపోయిన క్రికెటర్లు.. ఇంగ్లాండ్ బోర్డు సంచలన నిర్ణయం
Advertisement

england cricketers: యాషెస్ సిరీస్ 2025 ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఆశలతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టుకి తీవ్ర నిరాశ ఎదురయింది. ఇంతకుముందు ఎన్నడూ లేనంత బలంగా తమ జట్టు ఉందని భావించి.. సిరీస్ కి ముందే కప్ మాదే భావించిన ఇంగ్లాండ్ జట్టు అంచనాలు తారుమారయ్యాయి. ఈ సిరీస్ ని ఇప్పటికే ఆస్ట్రేలియా 3-0 తో సొంతం చేసుకుంది. మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా సిరీస్ ని చేజిక్కించుకుంది. దీంతో ఇంగ్లాండ్ జట్టుపై తీవ్ర విమర్శలు వెళ్ళువెత్తాయి.

Also Read: Dhoni – salman: ట్రాక్టర్ తో పొలం దున్నిన ధోని & సల్మాన్.. ఒళ్ళంతా బురదతో

ఇంగ్లాండ్ జట్టుపై సంచలన ఆరోపణలు:

Advertisement

ఇప్పటికే సిరీస్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్ జట్టుపై తాజాగా సంచలన ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఇంగ్లాండ్ క్రికెటర్లు ఫుల్లుగా మద్యం సేవించారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. రెండవ టెస్ట్, మూడవ టెస్ట్ ల మధ్య నూసాలో ఉన్న సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు విచ్చలవిడిగా మద్యం తాగారన్న వార్త సంచలనం రేపింది. బెన్ డకెట్ ఏకంగా మద్యం మత్తులో హోటల్ దారి మర్చిపోయాడనే వీడియో కూడా వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు {ECB} తీవ్రంగా స్పందించింది.

ఆటగాళ్లపై ఏకంగా విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై తాజాగా ఇంగ్లాండ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ రాబ్ కీ స్పందిస్తూ.. ” ఈ ఘటనపై దర్యాప్తు చేస్తాం. ఇలా ఫుల్లుగా మద్యం తాగడం ఆమోదయోగ్యం కాదు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇలా చేయడం ఎప్పటికీ నేను ఒప్పుకోను. ఇలాంటి ఘటనలపై దర్యాప్తు చేయకపోవడం తప్పిదం అవుతుంది. కానీ నాకు తెలిసినంతవరకు మా ఆటగాళ్లు మంచిగానే ప్రవర్తించారు. ఒకవేళ మా క్రికెటర్లు ఎక్కువగా తాగి ఉంటే అది ఖచ్చితంగా తప్పిదమే. మద్యం సేవించడం ఎవరికైనా హానికరం. ప్లేయర్లు డిన్నర్ సమయంలో ఒక గ్లాస్ వైన్ తాగితే పరవాలేదు. కానీ ఆ పరిమితి మించితే కచ్చితంగా క్షమించదగినది కాదు”. అని చెప్పుకొచ్చాడు.

Advertisement

 

బెన్ డకెట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్:

ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఫుల్లుగా మద్యం సేవించి దారి తప్పిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో తిరిగి ఎలా వెళ్లాలో తెలుసా అంటూ ఓ మహిళ ప్రశ్నించగా.. డకెట్ “తెలీదు” అని జవాబు ఇచ్చాడు. దీంతో పాటు మరో ఆటగాడు జాకబ్ బేతెల్ క్లబ్ లో మధ్యం మత్తులో డాన్స్ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. రెండవ టెస్టులో ఓటమి అనంతరం మళ్లీ కొత్తగా ఉత్తేజం పొంది సిద్ధం అయ్యేందుకు వీలుగా అంటూ హెడ్ కోచ్ మెక్ కల్లమ్ నాలుగు రోజులపాటు ఈ రిసార్ట్ ప్రణాళికను రూపొందించాడు.

Also Read: U19 Asia Cup 2025: వైభవ్ ను ర్యాగింగ్ చేసిన పాక్ ఫ్యాన్స్.. షాకింగ్ వీడియో వైరల్

అయితే ఆ మధ్యలో వచ్చిన సెలవు రోజు తరువాత జట్టుపై ఎటువంటి విమర్శలు రాలేదు. కానీ మూడవ టెస్టులో కూడా ఓడిపోయి.. ఏకంగా సిరీస్ కోల్పోయిన తర్వాత ఆటగాళ్ల షికారుపై చర్చ మొదలైంది. మొదట రిసార్ట్ లో మా ఆటగాళ్లు బాగానే ప్రవర్తించారు అని ప్రకటించిన రాబ్ కీ.. సిరీస్ కోల్పోయి ప్రస్తుతం తీవ్ర విమర్శలు రావడంతో పరిమితికి మించి మద్యం తీసుకోవడం మంచిది కాదని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని తెలిపాడు.

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×