టీమిండియా స్టార్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పై (Sachin Tendulkar) ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండూల్కర్ వికెట్ తీయాలంటే, చాలా కష్టపడాల్సిందేనని.. అప్పట్లో అతడి వికెట్ తీసేందుకు చాలా ప్రయత్నాలు చేశామని గుర్తు చేశారు. ఎంత మంది ఫీల్డర్లు ఉన్న గల్లీలో షాట్లు ఆడే మొనగాడు సచిన్ ఒక్కడేనని వ్యాఖ్యానించారు. అలాంటి ఆటగాడికి బౌలింగ్ చేయడం తన అదృష్టమేనని వివరించారు బ్రెట్ లీ.
సచిన్ టెండూల్కర్ క్రీజులో ఉన్నప్పుడు బౌలర్లపై ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను సైతం సచిన్ టెండుల్కర్ తన క్లాస్ షాట్లతో భయపెట్టించేవాడని వివరించారు. అలాంటి గొప్ప ఆటగాడికి బౌలింగ్ చేయడం తన కెరీర్ లో దక్కిన గౌరవం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మైదానంలో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ లు జరిగితే… గొడవలు జరిగేవి.. కానీ ఆ తర్వాత తమ అందరం కలిసిమెలిసిగా ఉండే వాళ్ళమని వివరించారు బ్రెట్ లీ.
లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ను తన అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తం 14 సార్లు అవుట్ చేశాడు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ. టెస్టుల్లో ఐదు సార్లు వికెట్ తీసిన బ్రెట్ లీ వన్డేలో 9 సార్లు పెవిలియన్ కు పంపాడు. ఈ క్రమంలోనే బ్రెట్ లీ సరికొత్త రికార్డు కూడా సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ ను అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ సార్లు ఔట్ చేసిన బౌలర్ గా రెండో స్థానంలో నిలిచాడు బ్రెట్ లీ. జేమ్స్ అండర్సన్ 17 సార్లు సచిన్ టెండూల్కర్ ను ఔట్ చేసి మొదటి స్థానంలో ఉన్నాడు.