E-Paper
Advertisement

Pakistan-T20I WC: కుక్క తోక ఎప్పుడూ వంక‌రే..జెర్సీపై పాకిస్తాన్‌ కొత్త నాట‌కాలు..ఇండియా పేరు తొల‌గించాలంటూ

Pakistan-T20I WC: కుక్క తోక ఎప్పుడూ వంక‌రే..జెర్సీపై పాకిస్తాన్‌ కొత్త నాట‌కాలు..ఇండియా పేరు తొల‌గించాలంటూ
Advertisement

Pakistan-T20I WC: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) కంటే ముందు పాకిస్తాన్ రోజుకో డ్రామా ఆడుతోంది. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం నాలుగు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో.. ఇప్పటికే ఇండియాకు సంబంధించిన మ్యాచ్ ను బహిష్కరించింది పాకిస్తాన్. ఇక తాజాగా మరో కొత్త పంచాయతీ తెరపైకి తీసుకువచ్చింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కొత్త జెర్సీని లాంచ్ చేసింది పాకిస్తాన్ ( Pakistan ). అయితే ఈ జెర్సీలో (Pakistan Jersy) ఇండియా పేరును తొలగించాలని డిమాండ్ చేస్తోంద‌ట‌ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇండియా అలాగే శ్రీలంకలో జరుగుతోంది కాబట్టి… కచ్చితంగా జెర్సీపై హోస్ట‌ర్ల‌ పేర్లు ఉంటాయి. కానీ ఆ రూల్స్ పక్కకు పెట్టి జెర్సీ పైన ఉన్న ఇండియా పేరును తొలగించాలని కొత్త వివాదానికి తెరలేపింది పాకిస్తాన్. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. ఇక ఈ పాకిస్తాన్ వాద‌న‌పై ఇండియ‌న్ ఫ్యాన్స్ కౌంట‌ర్ ఇస్తున్నారు. కుక్క తోక ఎప్పుడూ వంక‌రే…అంటూ పాకిస్తాన్ ను ఆడుకుంటోంది.

Also Read: Danish Kaneria: టీమిండియా అంటే నిద్ర‌లో కూడా ఉలిక్కిప‌డుతున్నారు..ఫైన‌ల్స్ ఆడాల్సి వ‌స్తే పారిపోతారా ?

జెర్సీపై పాకిస్తాన్‌ కొత్త నాట‌కాలు..ఇండియా పేరు తొల‌గించాలంటూ

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ జెర్సీ రివీల్ అయింది. అటు మొదటి మ్యాచ్ ఆడేందుకు శ్రీలంకలోని కొలంబోకు చేరుకుంది పాకిస్తాన్. ఆస్ట్రేలియా అలాగే పాకిస్తాన్ రెండు జట్ల మధ్య మూడు టి20 లు పూర్తి కాగానే వెంటనే, కొలంబోకు చేరుకుంది పాకిస్తాన్. అటు పాకిస్తాన్ తో పాటు ఆస్ట్రేలియా కూడా కొలంబోకు చేరుకుంది. ఇలాంటి నేపథ్యంలో తమ జెర్సీపై ఇండియా పేరు తొలగించాలని కొత్త డ్రామాలకు తెరదించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది పాకిస్తాన్ సర్కార్. ఈ మేరకు ఐసీసీ కి కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త తిరకాసు పెడుతోంది పాకిస్తాన్. తమ జెర్సీపై శ్రీలంక పేరు తప్ప ఇండియా పేరు ఉండకూడదని వెల్లడిస్తోందట. ఈ మేరకు ఐసీసీకి కూడా సమాచారం ఇచ్చిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీంతో వివాదం రాజుకుంది.

ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి ?

Advertisement

టి20 ప్రపంచ కప్ లేదా ఐసీసీకి సంబంధించిన ఏ ఈవెంట్ అయినా… హోస్టింగ్ చేసే దేశాల పేర్లు కచ్చితంగా ప్రతి జెర్సీ పైన ఉంటాయి. దాని ప్రకారమే టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ఇండియా అలాగే శ్రీలంకలో జరుగుతోంది కాబట్టి ఆ రెండు దేశాల పేర్లు అన్ని క్రికెట్ జట్ల జెర్సీలపై ఉంటాయి. కానీ దీన్ని పాకిస్తాన్ వ్యతిరేకిస్తోంది. కుక్క తోక ఎప్పుడూ వంకరే అన్న చందంగా పాకిస్తాన్ వ్యవహారం తయారైంది.

Also Read: Kevin Pietersen-Mohsin Naqvi: పాకిస్తాన్ కు సిగ్గుందా ? మ‌రీ..ఫైన‌ల్స్ లో టీమిండియాతో ఆడాల్సి వ‌స్తే, ఏం పీకుతారు? రెచ్చిపోయిన‌ పీట‌ర్స‌న్

 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×