E-Paper
Advertisement

SV Krishna Reddy: ‘అలీ’తో సౌందర్య చేయను అనడానికి కారణం ఇదే.. పెద్ద హీరోలు ఏం చెప్పారంటే?

SV Krishna Reddy: ‘అలీ’తో సౌందర్య చేయను అనడానికి కారణం ఇదే.. పెద్ద హీరోలు ఏం చెప్పారంటే?
Advertisement

SV Krishna Reddy: 90 దశకంలో దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి అంటే తెలియిన వారుండరు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలకు కొంత గ్యేప్ ఇచ్చారు. తాజాగా మళ్లీ సినిమా ల్లో బిజీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ యూట్యూబ్ ఇంటర్యూలో శుభలగ్నం సినిమాలో అలి పక్కన అప్పటి స్టార్ హీరోయిన్ చేయను అనడానకి గల కారణాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఎస్.వి. కృష్ణారెడ్డి ‘యమలీల’ సినిమా కోసం మొదట సౌందర్యను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే ఆ సినిమాలో హీరోగా ఆలీ నటిస్తున్నారని తెలియగానే, ఆమె ఆలీ పక్కన నటించడానికి నిరాకరించింది. ఆ సమయంలో సౌందర్య అగ్ర హీరోల సరసన నటిస్తోంది. ఒక కమెడియన్ (ఆలీ) పక్కన హీరోయిన్‌గా నటిస్తే తన భవిష్యత్తు కెరీర్ దెబ్బతింటుందని, పెద్ద హీరోలు తనతో నటించడానికి వెనకాడుతారని ఆమె భావించింది. ఇదే విషయాన్ని ఆమె దర్శకుడికి స్పష్టంగా చెప్పింది. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న కృష్ణారెడ్డి , ఆమెను బలవంతం చేయకుండా ఆమె స్థానంలో ఇంద్రజను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

Read also-Bhumika Chawla: భూమిక ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా?

మార్పు ఎలాఅంటే?

Advertisement

‘యమలీల’ ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’ సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత, సౌందర్య తన తప్పును తెలుసుకుంది. ఆమె స్వయంగా దర్శకుడికి ఫోన్ చేసి, తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకుంటున్నానని, మీ సినిమాలో కనీసం ఒక్క సీన్ లో కనిపించినా చాలని కోరింది. ఆమె అభ్యర్థన మేరకు, కృష్ణారెడ్డి ‘శుభలగ్నం’ సినిమాలో బాబు మోహన్ పక్కన ఒక పాటలో నటించే అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆమె ఎవరి పక్కన నటించడానికైనా సిద్ధమని చెప్పి ఆ పాత్రను చేసింది. కేవలం సౌందర్య మాత్రమే కాకుండా, కోట శ్రీనివాసరావు కూడా ఆలీ సినిమాలో నటించనని అన్నారని, దాంతో ఆయన స్థానంలో తనికెళ్ళ భరణిని తీసుకున్నట్లు దర్శకుడు వెల్లడించారు. దీంతో అప్పుడు అలీని ఎలా చూసేవారో అర్థం అవుతోంది.

Read also-Jayaprada Interview: బాపు గారి సీత జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.. ఆ వ్యక్తి ఏం చేశాడంటే?

కార్యచరణ

Advertisement

ఇదిలా ఉండగా ప్రస్తుతం తన వద్ద ప్రస్తుతం 10 కథలు సిద్ధంగా ఉన్నాయని, అందులో ‘మెజీషియన్స్ లవ్ స్టోరీ’, ‘అమ్మ పుట్టిన ఇల్లు’, ‘గంధర్వ వనం’ వంటివి ఉన్నాయని తెలిపారు. రాబోయే ఆరేళ్ల కాలానికి సరిపడా (సుమారు 300 పైగా) కథలు తన వద్ద ఉన్నాయని, వాటిని చిన్న చిన్న వీడియోలుగా యూట్యూబ్‌లో విడుదల చేస్తానని ఆయన చెప్పారు. అదే విధంగా తన సంగీతానికి చాలా మంది అభిమానులు ఉన్నారని వారిని సంతృప్తి పరచడానకి మళ్లీ మంచి సంగీతంలో ప్రక్షకుల ముందకు వస్తాను అంటూ అయన చెప్పుకొచ్చారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×