Josh Hazlewood Refused To Bowl To Pujara: టీమిండియా మిస్టర్ నయా వాల్ చతేశ్వర్ పుజారా…ఈ పేరు వినగానే, ఒకప్పుడు ప్రత్యర్థి బౌలర్లకు దడ పుట్టేది. ప్రతి టెస్ట్ లో అర్థ సెంచరీ లేదా సెంచరీ కొట్టిన తర్వాతే ముచ్చట… అన్నట్లుగా ఉండేది ఈ చతేశ్వర్ పుజారా వ్యవహారం. సింపుల్ గా చెప్పాలంటే టెస్ట్ లు అంటేనే పుజారా ( Cheteshwar Pujara) పేరు అందరికీ గుర్తుకొస్తుంది. అంతలా ఎదిగిపోయాడు. ఒకప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ టెస్టుల్లో అద్భుతంగా ఆడి టీమ్ ఇండియాను గెలిపించేవాడు. ఆ తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ ( VVS Laxman) తరహాలోనే చతేశ్వర్ పుజారా ఎదిగాడు. అయితే అలాంటి పుజారాకు ఆస్ట్రేలియా డేంజర్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ ( Josh Hazlewood) బౌలింగ్ చేసేందుకు భయపడ్డాడట. నెట్స్ లో కూడా బౌలింగ్ చేసేందుకు నిరాకరించినట్లు తాజాగా పుజారా వెల్లడించారు. ఈ ఇద్దరు క్రికెటర్లు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ లో కలిసి ఆడిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఎదురైనా విషయాన్ని తాజాగా గుర్తు చేసుకున్నారు పుజారా.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2018, 2021 సిరీస్ లలో చతేశ్వర్ పుజారా, ఆస్ట్రేలియా డేంజర్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ ( Josh Hazlewood) ఇద్దరు తలపడ్డారు. పుజారా బ్యాటింగ్ చేస్తుండగా చాలా సార్లు జోష్ హేజిల్ వుడ్ బౌలింగ్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో జోష్ హేజిల్ వుడ్ ను బాగానే ఎదుర్కొన్నాడు పుజారా. అయితే 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సందర్భంగా పుజారాను చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా కొనుగోలు చేయడం జరిగింది. అప్పటికే జోష్ హేజిల్ వుడ్ ఆ జట్టులోనే ఉన్నాడు. ఇన్ని రోజులు ప్రత్యర్ధులుగా తలబడ్డ ఈ ఇద్దరు, ఒకే జట్టుకు ఆడాల్సి వచ్చింది.
Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భయ్యా…కోహ్లీని, నన్ను బండబూతులు తిట్టాడు
ఈ క్రమంలో తొలిసారిగా నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా, పుజారాకు బౌలింగ్ తాను చేయబోనని జోష్ హేజిల్ వుడ్ వెల్లడించారట. నీకు వేయాలంటే నాకు భయమేస్తోందని కూడా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారట. ఇప్పటికే మనం మైదానంలో చాలా సార్లు తలపడ్డాం… ఇప్పుడు నెట్స్ లో కూడా ఆడడం అవసరమా ? అంటూ మెల్లిగా స్కిప్ అయ్యాడట జోష్ హేజిల్ వుడ్. ఈ విషయాన్ని తాజాగా పుజారా బయటపెట్టారు. తాను ఎంత బతిలాడిన కూడా జోష్ హేజిల్ వుడ్ బౌలింగ్ చేయలేదని వెల్లడించారు. దీంతో చతేశ్వర్ పుజారా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.