E-Paper
Advertisement

పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు
Advertisement

Major Gaurav Arya On Pak:  పాకిస్తాన్ క్రికెటర్లపై భారత సైనిక మాజీ అధికారి, రక్షణ విశ్లేషకులు మేజర్ గౌరవ్ ఆర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరుపై ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్ క్రికెటర్లు మైదానంలో ప్రణాళిక లేకుండా ఆడుతున్నారని హేళన చేస్తూ మాట్లాడారు. బుర్ర ఉపయోగించకుండా కేవలం మొండిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెటర్లు నిజంగా గాడిదలు అంటూ అభిమానించారు గౌరవ్ ఆర్య. టీమిండియా జట్టుతో ఆడేటప్పుడు వీళ్ళ బుర్రలు అస్సలు పనిచేయవు అని… హేళ‌న చేస్తూ మాట్లాడారు. అభిషేక్ శ‌ర్మ‌ను కించ‌ప‌రుస్తూ మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హించారు.

పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు..అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

పాకిస్తాన్ క్రికెటర్లు అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఐసీసీ టోర్నమెంట్స్ లలో టీమిండియాతో మ్యాచ్ లు ఆడేటప్పుడు దారుణంగా విఫలమవుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఐసీసీ టోర్నమెంట్లలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరిగితే.. పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న టి20 ప్రపంచ కప్ 2026, ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో కూడా దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై  భారత సైనిక మాజీ అధికారి, రక్షణ విశ్లేషకులు మేజర్ గౌరవ్ ఆర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెటర్లు నిజంగా గాడిదల లాంటి వాళ్లు అంటూ రెచ్చిపోయారు. టీమిండియాను ఓడించే దమ్ము లేదు కానీ… అభిషేక్ శర్మ లాంటి కుర్ర క్రికెటర్లను స్లెడ్జింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇండియాతో మ్యాచ్ ఆడేటప్పుడు ఆవేశానికి వెళ్లి, విఫలమవుతున్నారన్నారు. ఎలాంటి ప్రణాళికలు లేకుండా బరిలోకి దిగి… పళ్ళు రాలగొట్టుకుంటున్నారని చురకలు అంటించారు. మ‌రో 1000 జ‌న్మ‌లు ఎత్తినా అవేశంతో టీమిండియాను ఓడించలేర‌న్నారు.

Advertisement

Rana Naved On Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌల‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అభిషేక్ శర్మను చూసి నేర్చుకోండి – గౌరవ్ ఆర్య

పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన వసీం అక్రమ్, వకార్ యూనిస్ , జాబ్ అయితే జావేద్ లియాందాద్ లాంటి గొప్ప క్రికెటర్లతో అభిషేక్ శర్మ ఫోటో దిగితే తప్పుగా ప్రచారం చేస్తున్నారని పాకిస్తాన్ క్రికెటర్ల పై మండిపడ్డారు భారత సైనిక మాజీ అధికారి, రక్షణ విశ్లేషకులు మేజర్ గౌరవ్ ఆర్య. వాళ్లతో ఫోటోలు దిగి.. సలహా సూచనలు అభిషేక్ శర్మ తీసుకున్నాడని వెల్లడించారు. అంతేకానీ పాకిస్తాన్ తో స్నేహం కోసం కాదని కౌంటర్ ఇచ్చారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా అభిషేక్ శర్మను డిస్టర్బ్ చేసేందుకు హ‌రీస్ రౌఫ్ స్లెడ్జింగ్ చేశాడని గుర్తు చేశారు. అయితే స్లెడ్జింగ్ చేసినప్పటికీ కూడా అభిషేక్ శర్మ ( Abhishek sharma) ఏకాగ్రతతో మ్యాచ్ ఆడి.. పరుగులు రాబట్టాడని గుర్తు చేశారు. ఆవేశంతో కాకుండా, టీమిండియా ప్లేయ‌ర్ల లాగా ఆలోచించి పాకిస్తాన్ క్రికెటర్లు మ్యాచ్ ఆడడం నేర్చుకోవాలన్నారు.

Advertisement

Tanveer Ahmed On Babar Azam: టెస్టులను టీ20ల్లా బాబ‌ర్ ఆజం ఆడుతున్నాడు..ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తాడు!

Related News

మ‌హ్మ‌ద్ అమీర్ బాట‌లో మ‌రో పాకిస్తాన్ క్రికెట‌ర్‌ ఖుష్దిల్ షా

ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

బాబ‌ర్ ఆజంకు నెంబ‌ర్ 1 ర్యాంక్ ఇవ్వాల్సిందే…లేక‌పోతే ICCని రోడ్డుకు ఇడ్చుతా!

ఎన్ని రోజులైనా వాళ్లే, నా కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు…డేవిడ్ వార్న‌ర్ సంచ‌ల‌నం?

టీమిండియా బౌల‌ర్ల‌కు న‌రకం చూపించ‌డం నాకు ఎంతో ఇష్టం

డ్రెస్సింగ్ రూంలో ఆ దుర్మార్గుడు నా కాల‌ర్ ప‌ట్టుకుని అవ‌మానించాడు

విరాట్ కోహ్లీ-అనుష్క శ‌ర్మ ప‌రువు తీసిన సోనాక్షి సిన్హా..ఆన్ ఫాలో చేసి మ‌రీ !

Big Stories

Advertisement
×