E-Paper
Advertisement

సైబర్ నేరగాళ్లకు చుక్కలు చూపించిన హైదరాబాద్ సిటీ పోలీసులు!

సైబర్ నేరగాళ్లకు చుక్కలు చూపించిన హైదరాబాద్ సిటీ పోలీసులు!
Advertisement

Cyber Crime: సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సిటీ పోలీసుల మెరుపు దాడులు చేశారు. జూలై నెలలో మోత్తం 15 రాష్ట్రాల్లో ఆపరేషన్లు చేసి 49 మంది సైబర్ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. NCRP ఫిర్యాదుల ఆధారంగా 70 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీటిలో దాదాపుగా 25 ప్రధాన సైబర్ కేసులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేదించారు. బాధితులకు రూ.98.89 లక్షలను రికవరీ చేసి రిఫండ్ చేశారు. ట్రేడింగ్ ఫ్రాడ్ కేసుల్లో అత్యధికంగా 29 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

15 రాష్ట్రాల్లో సోదాలు..

ఈ దాడుల్లో తెలంగాణ నుంచి 13 మంది సైబర్ నిందితులు పట్టివేశారు. మహారాష్ట్ర, రాజస్థాన్, బెంగాల్ సహా 15 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. నిందితుల వద్ద 25 డెబిట్ కార్డులు, 23 మొబైళ్లను పోలీసలు స్వాధీనం చేసుకున్నారు. 3 ల్యాప్‌టాప్‌లు, చెక్‌బుక్కులు, పాస్‌బుక్కులు, పాస్‌పోర్ట్ సీజ్ చేశారు. జూలైలో ట్రేడింగ్ ఫ్రాడ్ వల్ల 11.75 కోట్లకు పైగా నష్టం వచ్చిందని. 38 కేసుల్లో బాధితులకు రూ.98.89 లక్షలు తిరిగి అందజేశారు. జోనల్ సైబర్ సెల్స్‌లో 298 కేసులు నమోదు చేసి 6 మందిని అరెస్ట్ చేశారు.

Advertisement

Also Read: విజయవాడలో బోండా ఉమ హల్‌చల్.. మల్లాది విష్ణు దీక్ష వద్ద ఊహించని సీన్!

231 జీరో ఎఫ్‌ఐఆర్‌లు..

సైబర్ పెట్రోలింగ్‌లో 128 ఫేక్ ప్రొఫైళ్లు, 36 ప్రకటనలు బ్లాక్ చేసారు. ఇప్పటివరకు దాదాపుగా 1,086 ఫేక్ ప్రొఫైళ్లు, 2,553 ప్రకటనలను పోలీసులు తొలగించారు. ‘సి-మిత్ర’ ద్వారా 1,537 మంది బాధితులకు సహాయం అందించారు. 231 జీరో ఎఫ్‌ఐఆర్‌లు హైదరాబాద్ పోలీసులలు నమోదు చేశారు. వాట్సాప్ హ్యాక్ చేసి 25 లక్షలు కాజేసిన కేసులో కీలక నిందితుడి అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే మోసాలను నమ్మొద్దని పోలీసుల హెచ్చరికలు జానీ చేశారు.

Advertisement

Also Read: హైడ్రా ఎంట్రీతో షాక్‌లో కాలేజీల యాజమాన్యాలు.. వెలుగులోకి బిగ్ స్కామ్స్!

Tags

Related News

ఏసీబీ దూకుడు.. భీంరెడ్డి బినామీ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

సిరిసిల్లలో 8 వేల ఎకరాల భూవివాదం.. అసలు లెక్క తేలేదెప్పుడు?

నిమజ్జనాల్లో అమ్మాయిలను వేధిస్తే ఇదే గతి.. 1,530 మందిపై కేసులు నమోదు

తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరినీ వదలం.. కోర్టులో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!

దమ్ముంటే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లు.. సీఎం రేవంత్‌కు రాంచందర్ రావు సవాల్!

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలారా.. సిగ్గుతో తలదించుకోండి: బండి సంజయ్

సుప్రీంలో చుక్కెదురు.. దానం నాగేందర్ ఆసక్తికర రియాక్షన్.. ‘ఇది ముందే తెలుసంటూ..!’

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

Big Stories

Advertisement
×