E-Paper
Advertisement

ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు
Advertisement

Ishant Sharma On MS Dhoni :  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni) మిస్టర్ కూల్ అన్న సంగతి తెలిసిందే. ఎలాంటి వివాదాలు లేకుండా టీమిండియా కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మొనగాడు మన మహేంద్ర సింగ్ ధోని. అలాంటి మహేంద్ర సింగ్ ధోనిపై చాలామంది మాజీ క్రికెటర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఒకప్పటి స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) హాట్ కామెంట్స్ చేశారు. మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ కాదని.. అతడికి పొగరెక్కువ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఒకానొక సమయంలో విరాట్ కోహ్లీతో పాటు తనను కూడా బండ బూతులు తిట్టాడని వెల్లడించారు. 2013 ఛాంపియన్ ట్రోఫీ సందర్భంగా తాను సరిగ్గా ఫీల్డింగ్ చేయనందుకు తనను బూతులు తిట్టినట్లు గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ కూడా అనవసర షాట్ ఆడినందుకు కూడా ఫైర్ అయినట్లు వెల్లడించారు. ఇలా రెండు సందర్భాలలో విరాట్ కోహ్లీ, తాను ధోని ఆగ్రహానికి గురైనట్లు గుర్తు చేశారు ఇషాంత్ శర్మ.

ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. ప్రపంచంలోనే మహేంద్ర సింగ్ ధోని గొప్ప కెప్టెన్ అని ప్రశంసించారు. అయితే మిస్టర్ కూల్ గా పేరు ఉన్న మహేంద్ర సింగ్ ధోని.. కొన్ని సమయాలలో సీరియస్ గా వ్యవహరిస్తాడని వివరించారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను కూడా ఇషాంత్ శర్మ గుర్తు చేశాడు. ఆ ట్రోఫీ సందర్భంగా తాను బౌండరీ గేట్ దగ్గర మిస్ ఫీల్డ్ చేశానని వివరించాడు. ఈ క్రమంలో తనను ధోని తిట్టినట్లు వివరించారు. అక్కడ నిలబెట్టింది.. బంతి పట్టడానికి తప్ప.. సినిమా చూడడానికి కాదంటూ ఫైర్ అయినట్లు వివరించారు.

Advertisement

Rana Naved On Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌల‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సందర్భంగా విరాట్ కోహ్లీ అనవసరమైన భారీ షాట్ ఆడాడని గుర్తు చేశారు. ఆ షాట్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అనవసరంగా అవుట్ అయ్యాడని పేర్కొన్నారు. దీంతో డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ కోహ్లీని ధోని కోప్పడ్డాడని వెల్లడించారు. జట్టులో బ్యాటర్లు తక్కువగా ఉన్నారని తెలిసి కూడా అలాంటి షాట్ ఆడాల్సిన అవసరం ఏముంది ? అంటూ కడిగిపారేసాడు అంట ధోని. అంటే ఇషాంత్ శర్మ చెప్పిన ప్రకారం ధోని ఊరికే కోపానికి రాడు.. సభ్యులు తప్పిదం చేస్తేనే ఆగ్రహిస్తాడు అన్నమాట. ఒక నాయకుడికి ఉన్న లక్షణాలు అన్నీ కూడా ధోనికి ఉన్న నేపథ్యంలోనే అతడు మిస్టర్ కూల్ అయ్యాడని ప్రశంసించారు ఇషాంత్ శర్మ.

Advertisement

Tanveer Ahmed On Babar Azam: టెస్టులను టీ20ల్లా బాబ‌ర్ ఆజం ఆడుతున్నాడు..ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తాడు!

 

Related News

బాబ‌ర్ ఆజంకు నెంబ‌ర్ 1 ర్యాంక్ ఇవ్వాల్సిందే…లేక‌పోతే ICCని రోడ్డుకు ఇడ్చుతా!

ఎన్ని రోజులైనా వాళ్లే, నా కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు…డేవిడ్ వార్న‌ర్ సంచ‌ల‌నం?

టీమిండియా బౌల‌ర్ల‌కు న‌రకం చూపించ‌డం నాకు ఎంతో ఇష్టం

డ్రెస్సింగ్ రూంలో ఆ దుర్మార్గుడు నా కాల‌ర్ ప‌ట్టుకుని అవ‌మానించాడు

విరాట్ కోహ్లీ-అనుష్క శ‌ర్మ ప‌రువు తీసిన సోనాక్షి సిన్హా..ఆన్ ఫాలో చేసి మ‌రీ !

డ్రెస్సింగ్ రూంలో ధోని న‌ర‌కం చూపించేవాడు…ముఖంపైనే డోర్లు వేసేవాడు

వెస్టిండీస్ ను చిత్తు చేశాం…ఇక‌ WTC టైటిల్ కూడా గెలుస్తాం

Big Stories

Advertisement
×