E-Paper
Advertisement

OTT Movie : నెత్తురుడికించే రియల్ స్టోరీ… ఒకే అమ్మాయిపై ఒక్కొక్కరూ… ఇది దాహం తీరని కథ

OTT Movie : నెత్తురుడికించే రియల్ స్టోరీ… ఒకే అమ్మాయిపై ఒక్కొక్కరూ… ఇది దాహం తీరని కథ
Advertisement

OTT Movie : రిలీజ్ సమయంలో కొన్ని సినిమాలు భారీగా కాంట్రవర్సీ అవుతుంటాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫూలన్ దేవి జీవితం ఆధారంగా ఓ కాంట్రవర్సీ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అపాలని, అప్పట్లో ఫూలన్ దేవి కేసు కూడా వేసింది. ఇప్పటికీ ఇండియన్ సినిమాల్లో బోల్డెస్ట్ బయోపిక్‌లలో ఒకటిగా ఉంది. ఈ సినిమా ఫూలన్ జీవితంలోని దారుణాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఆమె బాల్య వివాహం నుంచి బందిపోటు నాయకురాలిగా ఎలా మరిందో ఈ సినిమాలో చూడవచ్చు. తనపై జరిపిన దారుణమైన అఘాయిత్యానికి ప్రతీకారంగా, 1981లో 22 మందిని నిల్చోబెట్టి ఒక్కొక్కరిని కసితీరా చంపింది ఫూలన్. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మారుమోగింది. ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

1994లో రిలీజ్ అయిన ఈ హిందీ బయోపిక్ సినిమా పేరు ‘బండిట్ క్వీన్’ (Bandit Queen). షెకర్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీమా బిస్వాస్ ఫూలన్ దేవి పాత్రలో అద్భుతంగా నటించింది. కాన్స్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం Amazon Prime Video, youtube లో అందుబాటులో ఉంది. 1996 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ (షెకర్ కపూర్), బెస్ట్ యాక్ట్రెస్ (సీమా బిస్వాస్) గెలిచింది. కాన్స్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది.

Advertisement

Read Also : క్రీస్తును కొత్త కోణంలో చూపించన సినిమా… ఆ సీన్స్ తో వివాదాల సునామీ

స్టోరీ ఏమిటంటే

ఫూలన్ దేవి 1963లో ఉత్తరప్రదేశ్‌లోని పేద ఫ్యామిలీలో పుడుతుంది. 11 ఏళ్లకే తనకన్నా వయసులో చాలా పెద్దవాడైన పుత్తా లాల్ తో చైల్డ్ మ్యారేజ్ అవుతుంది. పెళ్ళి నాటి నుంచే ఆమెపై శారీరకంగా టార్చర్ చేసి బాధపెడతాడు. పుత్తా లాల్ టార్చర్ తటుకోలేక ఫూలన్ ఇంటికి పారిపోతుంది. కానీ ఆ గ్రామంలో థాకూర్ అనే పెద్ద మనిషి ఉంటాడు. అతనితో పాటు, అతని చెంచాలు ఆమెను అవమానిస్తారు. అంతటితో ఆగకుండా థాకూర్ గ్యాంగ్ ఆమెను కిడ్నాప్ చేసి దారుణంగా అనుభవిస్తారు. ఆ సమయంలో విక్రమ్ మల్లా అనే బందిపోటు లీడర్ ఆమెను రక్షించి తన గ్యాంగ్‌లో చేర్చుకుంటాడు. వీళ్ళ మధ్య ప్రేమ కూడా పుడుతుంది. కానీ శ్రీరామ్ అనే థాకూర్ గ్యాంగ్ మనిషి విక్రమ్‌ను చంపేసి, మళ్లీ ఆ గ్రామంలో ఫూలన్‌ పై  దారుణంగా అఘాయిత్యం చేస్తారు. ఆమె బట్టలు లేకుండా దీన స్థితిలో ఉన్నప్పుడు, నీళ్ళు తెమ్మని బావి దగ్గరకి పంపే సీన్ దారుణంగా ఉంటుంది. ఆ సీన్స్ చూడటానికి చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి.

Advertisement

ఫూలన్ రివెంజ్ తీర్చుకోవడానికి గుజ్జర్ గ్యాంగ్‌లో చేరుతుంది. ఆ గ్యాంగ్‌లో ఆమె లీడర్ కూడా అవుతుంది. ఇక థాకూర్ మనుషుల్ని టార్గెట్ చేస్తుంది. బెహ్మై గ్రామంలో ఆమెపై అఘాయిత్యం చేసిన 22 మంది థాకూర్ మనుషుల్ని లైన్‌లో నిలబెట్టి షూట్ చేస్తుంది. ఆ తర్వాత ఫూలన్ ఇండియా మొత్తం ఫేమస్ అవుతుంది. ఆమెను ‘బండిట్ క్వీన్’ అని అప్పటినుంచే పిలవడం మొదలైంది. పోలీసులకు సరెండర్ అవ్వడంతో పాటు. జైల్లో చాలా ఏళ్లు గడిపి బయటపడి రాజకీయాల్లోకి వస్తుంది. ఎలక్షన్లలో నిలబడి ఎంపీ అవుతుంది. అయితే ఫూలన్ దేవిని 2001, జులై 25న ఢిల్లీలోని ఆమె నివాసం ముందు షేర్ సింగ్ రాణా అనే వ్యక్తి కాల్చి చంపాడు. 1981లో ఫూలన్ దేవి, ఆమె ముఠా సభ్యులు ఠాకూర్ కులానికి చెందిన 22 మంది ఊచకోతకు ప్రతీకారంగానే ఫూలన్ దేవిని హత్య చేసినట్లు షేర్ సింగ్ రాణా కోర్టు విచారణలో తెలిపాడు. ఫూలన్ దేవి ఆ సమయంలో లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నారు. షేర్ సింగ్ రాణా ఈ హత్య తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.

 

 

 

 

 

Related News

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

Big Stories

Advertisement
×