Gill – Sara Tendulkar : సాధారణంగా క్రికెటర్ల లవ్ లైఫ్ కి సంబంధించిన ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఫలానా అమ్మాయితో ప్రేమలో ఉన్నారని.. ఫలానా హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పలు రూమర్స్ వస్తుంటాయి. టీమిండియా కెప్టెన్ శుబ్ మన్ గిల్ కూడా ఇలాంటి రూమర్స్ రావడం మీరు గమనించే ఉంటారు. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గిల్ ప్రేమాయణం నడిపిస్తున్నారని చాన్నాళ్లుగా పుకార్లు వస్తున్నాయి. శుబ్ మన్ గిల్ ఆడే ప్రతీ మ్యాచ్ కి సారా టెండూల్కర్ హాజరవ్వడం.. అతని బ్యాటింగ్ టైమ్ లో చప్పట్లు కొడుతూ ఆమె ఎంకరేజ్ చేయడం అప్పట్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శుబ్ మన్ గిల్-సారా టెండూల్కర్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Kohli – Pietersen : అందమైన అమ్మాయిల మధ్యలో కోహ్లీ… అలాం సైగలు చేస్తూ రచ్చ.. ఇదిగో వీడియో
గిల్ కంటే సారానే పెద్దది..
శుబ్ మన్ గిల్ కంటే వయస్సులో సారా టెండూల్కర్ చాలా పెద్దది అనే వార్త వైరల్ అవుతోంది. వాస్తవానికి శుబ్ మన్ గిల్ సెప్టెంబర్ 08, 1999 న జన్మించాడు. సారా టెండూల్కర్ అక్టోబర్ 12, 1997లో జన్మించింది. అంటే శుబ్ మన్ గిల్ కంటే సారా టెండూల్కర్ రెండు సంవత్సరాలు పెద్దది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా తన భార్య కంటే వయస్సులో చిన్న వాడే. అంజలి సచిన్ టెండూల్కర్ కంటే దాదాపు ఆరు సంవత్సరాలు వయస్సులో పెద్దది. ఇక సారా టెండూల్కర్ ఒకవేళ శుబ్ మన్ గిల్ ని వివాహం ఆడితే సారా టెండూల్కర్ కి కూడా తల్లి అంజలి సాలు వచ్చిందని చర్చించుకుంటారని పలువురు పేర్కొనడం గమనార్హం.
సారా, గిల్ ప్రేమాయణం..
సోషల్ మీడియాలో సచిన్ కూతురు ఇటీవలే సారా టెండూల్కర్ బెడ్ పై తన ఫ్రెండ్స్ తో కనిపించింది. దీంతో సారా అమ్మాయిలతోనే బెడ్ షేర్ చేసుకుంటుందంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈనెల 08వ తేదీన తన ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్లింది సారా. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా వేదిక గా పంచుకుంది. ఆమె స్నేహితులతో కలిసిన క్షణాలను.. జ్యూరిచ్ లోని ఫొటోలను షేర్ చేసింది. ” జూనియర్స్ బేర్ యంగ్ పార్ట్నర్స్” ప్రోగ్రాం లో పాల్గొనేందుకు జ్యూరిచ్ కి వెళ్ళింది. సారా టెండూల్కర్ పోస్ట్ చేసిన ఫోటోలలో.. ఆమె వైట్ కలర్ డ్రెస్ లో అద్భుతంగా కనిపించింది. అయితే సారా టెండూల్కర్ చేసిన ఈ పోస్ట్ పై నెటిజెన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి ప్రేమ, పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.