BigTV English

Vijayawada : యువతిపైకి పెంపుడు కుక్కను ఉసిగొల్పిన యువకుడు.. పొట్టుపొట్టు కొట్టుకున్న ఇరువర్గాలు..

Vijayawada : యువతిపైకి పెంపుడు కుక్కను ఉసిగొల్పిన యువకుడు.. పొట్టుపొట్టు కొట్టుకున్న ఇరువర్గాలు..

Vijayawada : వాళ్లు ఒకే వీధిలో ఉంటారు. ఆ యువతి కాలేజీకి వెళ్తోంది. ఆమె తాత మనవరాలిని బస్సు ఎక్కించేందుకు తోడుగా వెళ్తున్నాడు. అంతలోనే అటుగా అభి అనే యువకుడు జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. అతనితో పాటు పెంపుడు కుక్క కూడా ఉంది. వాడి జాగింగ్ ఏదో వాడు చేసుకోకుండా.. ఆ యువతిని టీజ్ చేసే ప్రయత్నం చేశారు. పెట్ డాగ్‌ను ఆ అమ్మాయిపైకి ఉసిగొల్పాడు. అది చూసి ఆమెతో ఉన్న తాత రామరావు మందలించాడు. ఇదేం పనంటూ అభితో గొడవ పెట్టుకున్నాడు. ఆ యువకుడు సైతం మాటకు మాట అంటూ వాగ్వాదానికి దిగాడు. కట్ చేస్తే…


విజయవాడలో స్ట్రీట్ ఫైట్

కాసేపటికే ఆ వీధిలో చిన్నపాటి యుద్ధం మొదలైంది. ఇటు యువతి కుటుంబ సభ్యులు.. అటు యువకుడి ఫ్యామిలీ మెంబర్స్ అంతా రోడ్డు మీదకు వచ్చారు. తమ అమ్మాయిని ఏడిపిస్తున్నారంటూ ఆమె తరపు వాళ్లు ప్రశ్నించారు. మా వాడిని అన్యాయంగా తిడుతున్నారంటూ అతడికి సపోర్ట్‌గా నిలిచింది ఆ ఫ్యామిలీ. మేటర్ ముదిరింది. ఇరువర్గాలు తిట్టుకున్నారు. సడెన్‌గా కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. చిన్నా పెద్దా.. ఆడా మగా.. అంతా తలో చేయి వేశారు. దొరికిన వారు దొరికినట్టు కుమ్మేసుకున్నారు. ఎవరు ఎవరిని కొడుతున్నారో అర్థం కానంతగా రెచ్చిపోయారు. జుట్లు పట్టుకుని లాగేశారు. బట్టలు చింపేశారు. పిడిగుద్దులు గుద్దేశారు. కాలితో తన్నుకున్నారు. రెండు కుటుంబాలకు చెందిన సుమారు 20 మంది వరకు వీధిలో పడి పొట్టుపొట్టు కొట్టుకున్నారు. అదంతా సమీపంలోని సీసీకెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఫైటింగ్ ముసిశాక.. ఇరు వర్గాలు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేశాయి. తన కుమార్తెను అభి ఏడిపిస్తున్నాడంటూ యువతి తండ్రి శ్రీనివాసరావు కంప్లైంట్ ఇచ్చారు. తనను అనవసరంగా కొట్టారంటూ అభి సైతం ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. ఇరువర్గాలకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశాయి.

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×