Kohli – Pietersen : భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ లండన్ లో YMC లా విందును ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ క్రికెటర్లు పాల్గొన్నారు. వీరిలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, పీటర్సన్.. టీమిండియా క్రికెటర్లు ఇలా చాలా మంది పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కోహ్లీ అందమైన అమ్మాయిల మధ్యలో కూర్చొని ఎంజాయ్ చేశాడు. ముఖ్యంగా వారికి అలాంటి సైగలు కూడా చేస్తూ రచ్చ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంలో పీటర్సన్ కూడా అక్కడ కనిపించడం విశేషం.
Also Read : Italy Creates History: ఇటలీ సరికొత్త హిస్టరీ…T20 ప్రపంచ కప్ 2026 లోకి ఎంట్రీ !
ఆ క్రికెటర్లతో విరాట్ కోహ్లీ..
YMC గాలా డిన్నర్ లో యువరాజ్ సింగ్ నల్లటి సూట్ లో అందంగా కనిపించాడు. అతనితో పాటు వచ్చిన అతని భార్య, హాజెల్ కీచ్ నలుపు తెలుపు స్ట్రాప్ లెస్ గౌన్ ధరించింది. ఇక ఆమె గాలా లుక్ లో అద్భుతంగా కనిపించింది. టీమిండియా కీలక క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్రౌన్ సూట్ ధరించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నల్లటి సూట్ ధరించాడు. అలాగే అతని కూతురు సారా టెండూల్కర్ తెల్లని దుస్తులతో చాలా అందంగా కనిపించింది. వీరితో పాటు మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, కెవిన్ పీటర్సన్, బ్రియాన్ లారా, క్రిస్ గేల్, ఒవైస్ షా, ఆశీష్ నెహ్రా వంటి పలువురు క్రికెటర్లు కూడా హాజరయ్యారు. అలాగే టీవీ వ్యాఖ్యాత గౌరవ్ కపూర్, గాయని కనికా కపూర్ హాజరయ్యారు.
బ్యూటీఫుల్ గర్ల్స్ మధ్యలో కోహ్లీ..
ఈ సందర్భంలోనే టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యూటీఫుల్ గర్ల్స్ మధ్యలో కనిపించే వీడియో గురించి నెటిజన్లు చర్చించుకోవడం విశేషం. మరోవైపు ఇటీవలే టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కామెంటరీ చేస్తున్న మాజీ ఇంగ్లాండ్ బ్యాటర్ జొనాథన్ ట్రోట్ విరాట్ కోహ్లీ లండన్ అడ్రస్ గురించి కీలక సూచన చేసిన విషయం తెలిసిందే. కోహ్లీ లండన్ లోని సెయింట్ జాన్స్ వుడ్ లేదా దానికి సమీపంలో నివసిస్తున్నాడని ట్రోట్ అనుకోకుండా వెల్లడించాడు. మరోవైపు ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్ లతో కలిసి లండన్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ముఖ్యంగా వారి రెండో సంతానం అకాయ్ లండన్ లోనే జన్మించాడు. క్రికెట్ మ్యాచ్ లు లేనప్పుడు కోహ్లీ ఎక్కువగా లండన్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం.. విరాట్ కోహ్లీ తన లండన్ ఇంట్లో శుబ్ మన్ గిల్, రిషబ్ పంత్ వంటి భారత ఆటగాళ్లకు ఆతిథ్యం ఇచ్చారని వార్తలు వచ్చాయి. విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్ కి వీడ్కోలు పలికిన తరువాత బహిరంగంగా కనిపించడం లేదు.
?igsh=MW9yeXZncGI3ZTc4bw==