E-Paper
Advertisement

CCRAS Recruitment: పదితో భారీగా ఉద్యోగాలు.. జీతం రూ.39,100, ప్రాసెస్ ఇదే..

CCRAS Recruitment: పదితో భారీగా ఉద్యోగాలు.. జీతం రూ.39,100, ప్రాసెస్ ఇదే..
Advertisement

CCRAS Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్ట్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్త చేసుకోవచ్చు. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.  సెలక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగాలు – వెకెన్సీలు, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్- ఏ, బీ, సీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఆగస్ట్ 31న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 394

సెంట్రల్ కౌన్సిల్ ఫర్‌ రీసెర్చ్ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌ గ్రూప్-ఏ, బీ, సీ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎండీ, ఎంఎస్, ఎంఫార్మ్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 27 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. గ్రూప్- ఏ పోస్టులకు రూ.15,600 నుంచి రూ.39,100 జీతం ఉంటుంది. గ్రూప్ -బీ పోస్టులకు అయితే రూ.9300 నుంచి రూ.34,800 జీతం ఉంటుంది. గ్రూప్- సీ పోస్టులకు రూ.9300 నుంచి రూ.34,800 జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 1

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 31

దరఖాస్తు ఫీజు: గ్రూప్‌-ఏ, బీ, సీ పోస్టులకు జనరల్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.1000, 500, 200 ఫీజు ఉంటుంది. ప్రాసెసింగ్‌ ఫీజు 500, 200, 100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఉద్యోగ ఎంపిక విధానం: సీబీటీ, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://ccras.nic.in/documents/applications-are-invited-for-the-various-group-a-b-and-c-posts-ccras-hqrs-new-delhi/

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 394

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 31

ALSO READ: PM Kisan: పీఎం కిసాన్ రూ.2వేలు మీ అకౌంట్లో పడాలంటే.. వెంటనే ఇలా చేయండి

ALSO READ: ECIL Recruitment: 55వేల జీతంతో హైదరాబాద్‌లో జాబ్స్.. జస్ట్ ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు బ్రో

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×