BigTV English

Riyan Parag YT Search History: యువ ఆటగాడిపై ట్రోలింగ్స్.. ‘ఛీ.. నీకు ఇదేం పాడు బుద్ధి భయ్యా’ అంటూ..!

Riyan Parag YT Search History: యువ ఆటగాడిపై ట్రోలింగ్స్.. ‘ఛీ.. నీకు ఇదేం పాడు బుద్ధి భయ్యా’ అంటూ..!

Riyan Parag Alleged YouTube Search History Goes Viral: ఐపీఎల్-17 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి అత్యధిక పరుగులు తీసి అందరి ప్రశంసలు అందుకున్న ప్రముఖ క్రికెటర్ రియాన్ పరాగ్.. గతంలో సోషల్ మీడియాలో పలు పోస్ట్ లు పెట్టి, అదేవిధంగా క్రికెట్ మైదానంలో వింత చర్యలకు పాల్పడుతూ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే మరోసారి ఆయనపై పెద్ద ఎత్తున నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇదేం పాడు బుద్ధి భయ్యా అంటూ అతడిపై సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఇంకొంతమంది భయ్యా నువ్వు మాంచి రసికుడివి అంటూ పరాగ్ ను ఆడేసుకుంటున్నారు. ఎందుకు నెటిజన్స్ అంతలా ట్రోల్ చేస్తున్నారు అంటే..


క్రికెట్ లో బాగా రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకునే రియాన్ పరాగ్ ఐపీఎల్ 17 సీజన్ లో అత్యధిక పరుగులు చేశాడు. దీంతో ఆయనకు అధిక పరుగులు చేసినవారి జాబితాలో మూడో స్థానం దక్కింది. మొదటి స్థానం కోహ్లీ(741), రుతురాజ్ గైక్వాడ్(583)కి రెండో స్థానం, ఆ తరువాతి స్థానం రియాన్ కే దక్కింది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే, ఐపీఎల్ సీజన్ ముగిసి ఒక్క రోజు కూడా కాకముందే తన ప్రవర్తనతో నెటిజన్స్ నుంచి మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతడి యూట్యూబ్ సెర్చ్ హిస్ట్రీ మొత్తం అభ్యంతరకమైన కంటెంట్ తో నిండి ఉండడం ఇందుకు కారణమైంది.

Also Read: Priyadarshini: ఈమె ఒక స్టార్ హీరో కూతురు.. స్టార్ హీరో చెల్లెలు.. మరో స్టార్ హీరో భార్య.. ఎవరో చెప్పుకోండి..?


Riyan Parag
Riyan Parag

పరాగ్.. లైవ్ స్ట్రీమింగ్ చేసే గేమింగ్ ఛానెల్ ను నడుపుతున్నాడు. లైవ్ స్ట్రీమింగ్ సమయంలో రియాన్ పరాగ్ యూట్యూబ్ లో కాపీరైట్ లేని సంగీతం కోసం వెతికాడు. సెర్చ్ బాక్స్ పై అతడు క్లిక్ చేయగానే సెర్చ్ హిస్టరీలో బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు కనిపించాయి. ఆ పేర్ల పక్కనే హాట్ అని రాసి ఉంది. సెర్చ్ హిస్టరీని అతడు హైడ్ చేయకపోవడంతో అతడి పర్సనల్ హిస్టరీ కాస్త పబ్లిక్ లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: అమెరికాలో తొలిసారి.. టీ 20 ప్రపంచకప్ క్రికెట్ పోటీలు

దీంతో రియాన్ పరాగ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వీడియో చూసిన నెటిజన్స్ నెట్టింటా పోస్ట్ లు పెడుతున్నారు. ఛీ..నీకు ఇదేం పాడు బుద్ధి భయ్యా అంటూ ఒకరు, భయ్యా నువ్వు మంచి ఆటగాడివే అంటూ ఇంకొకరు.. హీరోయిన్ల వీడియోలు చూసి సొల్లు కారుస్తున్నావేంది భయ్యా అంటూ మరొకరు.. ఇలా రకరకాలుగా పోస్ట్ లు పెడుతూ పరాగ్ ను నెట్టింటా ఆడేసుకుంటున్నారు.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×