BigTV English

Allari Naresh in Bachala Malli Movie: అల్లరి నరేష్ మరో కొత్త అవతారం.. ఈసారి మోత మోగిపోవాల్సిందే..!

Allari Naresh in Bachala Malli Movie: అల్లరి నరేష్ మరో కొత్త అవతారం.. ఈసారి మోత మోగిపోవాల్సిందే..!

Allari Naresh First look Released in Bachala Malli Movie: ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఈ మధ్యనే అల్లరి నరేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీ హీరోగా మంచి హిట్స్ అందుకున్న నరేష్.. మధ్యలో తన పంథా మార్చుకొని సీరియస్ పాత్రల్లో నటించడం మొదలుపెట్టాడు. నాంది, ఉగ్రం, మారేడుమిల్లి లాంటి సినిమాలు చేశాడు. అయితే నాంది తప్పించి మిగతా రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయాయి.


ఇక దీంతో మళ్లీ తన కామెడీ ట్రాక్ ను మొదలుపెట్టాడు. అందులో భాగంగానే ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో నటించాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది కానీ,విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ దెబ్బతో మరోసారి నరేష్..సీరియస్ పాత్రలోకి మారిపోయాడు. ప్రస్తుతం నరేష్ నటిస్తున్న చిత్రం బచ్చలమల్లి. సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా మరియు బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నరేష్ సరసన అమృత అయ్యర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి నరేష్ నుంచి ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. పేరు మల్లి.. ఇంటిపేరు బచ్చల.. చేసేది ట్రాక్టర్ డ్రైవర్.. ఈ బచ్చలమల్లి కచ్చితంగా మీకు చాలా రోజులు గుర్తుండిపోతాడు అంటూ చెప్పుకొచ్చారు.


Also Read: Mehreen Pirzada: బ్లాక్ బికినీలో కృష్ణగాడి గర్ల్ ఫ్రెండ్.. సెగలు పుట్టిస్తుంది ఇలా

ఇక నరేష్ ఊర మాస్ అవతార్ లో కనిపించాడు. రిక్షా సీటులో కూర్చొని.. ఒక కాలు పైకి పెట్టి.. ఒక చేత్తో సిగరెట్ ను పీలుస్తూ.. సీరియస్ లుక్ లో కనిపించాడు. 1990 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ నడుస్తుందని సమాచారం. మరి ఈ సినిమాతో నరేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×