GunaSekhar Announced His New Movie: స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసిన సినిమాలు.. వేసిన సెట్స్ ఇప్పటికే తెలుగు సినిమా గురించి మాట్లాడాలంటే గుణశేఖర్ సెట్స్ గురించి కూడా ప్రస్తావన వస్తుంది. ఒక్కడు, చూడాలని ఉంది, అర్జున్, వరుడు.. ఇలా ఆయన దర్శకత్వం వహించిన సినిమాలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
అయితే అంతకుముందున్న హైప్ ఇప్పుడు గుణశేఖర్ కు లేదు. గతేడాది శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శాకుంతల దేవిగా సమంత నటించింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. సెట్స్ కాకుండా టేకింగ్ లో కూడా గుణశేఖర్ తడబడ్డాడు అని విమర్శలు వచ్చాయి.
ఇక ఈ సినిమా తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న ఆయన తన కొత్త సినిమాను ప్రకటించాడు. యుఫోరియా అనే టైటిల్ తో రాబోతున్నట్టు గుణశేఖర్ అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాను గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమా గుణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరో ఎవరు అనేది గుణశేఖర్ రివీల్ చేయలేదు.
ఇకపోతే ఈసారి యువతను ఆకట్టుకోవడానికి గుణశేఖర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అభిమానులు.. మళ్లీ గుణశేఖర్ మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి ఇందులో హీరో ఎవరు.. ? అసలు ఆ టైటిల్ కు అర్ధం ఏంటి.. ? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అభిమానులు కోరుకుంటున్నట్లు గుణశేఖర్ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తాడా.. ? లేదా.. ? అనేది కాలమే నిర్ణయించాలి.
Also Read: Venu Swamy: పవనే సీఎం..ప్లేట్ ఫిరాయించిన వేణుస్వామి.. పవన్ ఫ్యాన్స్ బాగా ఇచ్చినట్టున్నారు
A euphoric journey begins!
Presenting the title of my next – #Euphoria.
A soul-stirring raw cinematic experience awaits!– https://t.co/nNukZJ8OFI@gunahandmade @neelima_guna
— Gunasekhar (@Gunasekhar1) May 28, 2024