BigTV English

Priyadarshini: ఈమె ఒక స్టార్ హీరో కూతురు.. స్టార్ హీరో చెల్లెలు.. మరో స్టార్ హీరో భార్య.. ఎవరో చెప్పుకోండి..?

Priyadarshini: ఈమె ఒక స్టార్ హీరో కూతురు.. స్టార్ హీరో చెల్లెలు.. మరో స్టార్ హీరో భార్య.. ఎవరో చెప్పుకోండి..?

Priyadarshini: ఘట్టమనేని కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చి..తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఇక ఆయన లెగసీని ఆయన కుమారుడు మహేష్ బాబు ముందుకు తీసుకెళ్తున్నాడు. కృష్ణ నట వారసుడుగా మహేష్ కన్నా ముందు రమేష్ బాబు వచ్చాడు.


ఇక ఇద్దరూ అన్నదమ్ములు తండ్రి పేరును నిలబెట్టి.. తండికి తగ్గ తనయులు అనిపించుకున్నారు. రమేష్ కొన్నేళ్ళకు సినిమాలను వదిలేయగా .. మహేష్ తండ్రి స్థానాన్ని అందుకున్నాడు. ఇక మూడేళ్ళ క్రితమే రమేష్ బాబు మృతి చెందాడు.. ఆ తరువాత కృష్ణ కూడా మృతిచెందారు. అందరికి తెల్సిన ఘట్టమనేని వారసులు వీరే.. కానీ, కృష్ణకు ఇంకో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంజుల, ప్రియదర్శిని. మంజుల కూడా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించింది.

దర్శకురాలిగా కూడా ప్రతిభ చూపించింది. ఇక ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేని వారసురాలు అంటే ప్రియదర్శిని ఘట్టమనేని మాత్రమే. ప్రియ.. చదువు పూర్తికాగానే సుధీర్ బాబు అనే వ్యక్తిని వివాహమాడింది. సుధీర్ బాబు పెళ్లి తరువాతనే హీరోగా మారాడు. ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. సుధీర్, ప్రియదర్శినిల పెళ్లి.. 2006 లో గ్రాండ్ గా జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. చరిత్ మానస్, దర్శన్. ఇద్దరు బాలనటులుగా అలరించారు. చరిత్ అయితే.. మేనమామ మహేష్ కు జిరాక్స్ అని చెప్పాలి.


ఇక పెళ్లి తరువాత ప్రియా.. ఇంటి ఇల్లాలిగానే సెటిల్ అయ్యిపోయింది. అయితే నేడు ప్రియ- సుధీర్ ల 18 వ వార్షికోత్సవం. దీంతో సుధీర్ తన భార్య ప్రియకు ఎంతో స్పెషల్ గా విష్ చేశాడు. ప్రియ పెళ్లి చూపుల ఫోటోను షేర్ చేస్తూ.. ” వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రియ.. నువ్వు నన్ను పూర్తిచేశావ్. నాతో ఉన్నప్పటి తన మొదటి ఫోటో.. పెళ్లిచూపులు ఫోటో” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రియ ఆ ఫొటోలో ఎంతో అందంగా ఉంది. ఇప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నా కూడా అంతే అందంగా ఉంది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం సుధీర్ బాబు.. హరోంహర సినిమాతో బిజీగా మారాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×