Vijay Oath Ceremony: తమిళనాడు రాష్ట్రంలో హీరో విజయ్ (CM Vijay) ప్రభంజనం సృష్టించాడు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 సంవత్సరాల అనుభవం ఉన్న డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలను చిత్తుగా ఓడించి, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు విజయ్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాలు గెలుచుకున్న టీవీకే విజయ్, ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఇవాళ చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా జరిగింది. సీఎం గా విజయ్ ప్రమాణస్వీకారం చేస్తున్న క్రమంలో ఒకసారి గా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మెరిసాడు.
Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువరాజ్ రొమాన్స్..ఇంతకు ఎవరీ నవ్య నాయర్ ?
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం (CM Vijay’s oath ceremony ) చేస్తున్న క్రమంలో.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అన్షుల్ కంబోజ్ (CSK star anshul kamboj) మాదిరి లాగానే ఉన్న ఓ ఆఫీసర్ డ్యూటీ చేస్తూ మెరిశాడు. విజయ్ వెనకాల నిలబడ్డ ఆ అధికారి, అచ్చం చెన్నై బౌలర్ అన్షుల్ కాంబోజ్ లాగా ఉండడం హాట్ టాపిక్ అయింది. అయితే దీన్ని గుర్తించిన టీమిండియా మాజీ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (Chennai R Ashwin) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి ఈ విషయాన్ని వెల్లడించారు.
డ్యూటీ ఎప్పుడు ముఖ్యమే… కానీ తప్పక గెలవాల్సిన లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( LSG VS CSK) మ్యాచ్ రోజు మరీ ఎక్కువైంది అని అన్షుల్ కాంబోజ్ ను ఉద్దేశించి పేర్కొన్నారు అశ్విన్ (R Ashwin). క్యాప్ తీసుకొని వెంటనే స్టేడియానికి వచ్చేయ్.. చెన్నై సూపర్ కింగ్స్ ను గెలిపించు అని అశ్విన్ రాసుకొచ్చారు. ఇక దీనికి చెన్నై సూపర్ కింగ్స్ అదిరిపోయే రిప్లై ఇచ్చింది. డోంట్ వర్రీ.. అన్షుల్ కాంబోజ్ (CSK star anshul kamboj) ఇక్కడే ఉన్నాడు అంటూ ఆన్సర్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) యాజమాన్యం. దీంతో అన్షుల్ కాంబోజ్ అలాగే విజయ్ కార్యక్రమంలో మెరిసిన అధికారి ఇద్దరూ వేరు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Tamilnadu assembly elections) 107 స్థానాలతో లార్జెస్ట్ పార్టీగా నిలిచిన విజయ్ కి ఇతర పార్టీలు కూడా సపోర్ట్ చేశాయి. కాంగ్రెస్ ఐదు, కమ్యూనిస్టు పార్టీలు నాలుగు, విసీకే రెండు అలాగే ఐయూఎమ్ఎల్ ఒక స్థానంతో కలుపుకొని 120 మంది ఎమ్మెల్యేల బలాన్ని విజయ్ ( CM Vijay) సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.
Respect for my bro Anshul Kamboj. He’s doing double duty. Standing in security for Tamil Nadu CM Vijay and then joining CSK at 3 PM for the match 🫡 https://t.co/Bf2zeoZODV pic.twitter.com/VJApQeAuMg
— Gagan🇮🇳 (@1no_aalsi_) May 10, 2026