Big Stories

IPL 2024 CSK Vs SRH Highlights: సీఎస్కే ఘన విజయం.. హైదరా‘బాదుడు’ ఏది?

Chennai Super Kings Vs Sunrisers Hyderabad Highlights: ఐపీఎల్ 2024 సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ సీన్ రివర్స్ అయ్యింది. ఇంతకుముందు టాప్ టొపారాలు లేపిన ఆ జట్టు, ప్రస్తుతం దారుణంగా చాప చుట్టేస్తోంది. బాల్ మొదలెట్టిన దగ్గర నుంచి ఎటాకింగ్ మోడ్ లోకి వెళ్లడంతో త్వరత్వరగా ఆలౌట్ అయిపోతోంది. చెన్నయ్ తో జరిగిన మ్యాచ్ అంతా ఏకపక్షంగా సాగిపోయింది.

- Advertisement -

హైదరాబాద్ సన్ రైజర్స్ మొదట టాస్ గెలిచి బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన చెన్నయ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. జస్ట్ 2 పరుగుల తేడాతో రుతురాజ్ సెంచరీ మిస్ అయ్యింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 18.5 ఓవర్లలో 134 పరుగులకి ఆలౌట్ అయిపోయింది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే…213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ ఓపెనర్లు చేతులెత్తేశారు. ట్రావిస్ హెడ్ (13), అభిషేక్ శర్మ (15) త్వరగా అవుట్ అయిపోయారు. ఫస్ట్ డౌన్ వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అంతే ఇక హైదరాబాద్ కోలుకోలేదు. వెనుక వికెట్లు లేవు. కొండంత స్కోరు ముందుంటే అందరూ రాంగ్ షాట్లు ఆడి చేజేతులారా వికెట్లు పారేసుకున్నారు.

Also Read: అతన్ని వరల్డ్ కప్‌కు తీసుకోండి.. లేదంటే నష్టపోతారు..

మార్ క్రమ్ (32), నితీష్ కుమార్ (15), హెన్రిచ్ (20), అబ్దుల్ సమాద్ (19) అంతే వీళ్లే రెండంకెల స్కోరు చేశారు. తర్వాత అందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కెప్టెన్ కమిన్స్ కూడా కేవలం 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొత్తానికి 18.5 ఓవర్లలో 134 పరుగులకి చాప చుట్టేసింది.

చెన్నయ్ బౌలింగులో తుషార్ దేశ్ పాండే 4, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2, పతిరణ 2, రవీంద్ర జడేజా 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నయ్ ఓపెనర్ ఆజ్యింక రహానె (9) త్వరగా అవుట్ అయిపోయాడు. మరో ఓపెనర్ కెప్టెన్  రుతురాజ్ మాత్రం ఎప్పటిలా చెలరేగి ఆడాడు. జస్ట్ రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 54 బంతుల్లో 3 సిక్స్ లు, 10 ఫోర్ల సాయంతో 98 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన డేరీ మిచెల్ 32 బంతుల్లో 1 సిక్స్, 7 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. శివమ్ దుబె (39), ధోనీ (5) చివర్లో ఆడి స్కోరుని 212కి తీసుకువెళ్లారు.

Also Read: KKR vs DC, IPL Preview: వరుస విజయాలతో ఢిల్లీ దూకుడు.. నేడు కోల్ కతా తో మ్యాచ్

హైదరాబాద్ బౌలింగులో భువనేశ్వర్ 1, నటరాజన్ 1, జయదేవ్ 1 వికెట్లు పడగొట్టారు.

ఈ గెలుపుతో సీఎస్కే మళ్లీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి వెళ్లింది. హైదరాబాద్ నాలుగో స్థానానికి పడిపోయింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News