BigTV English

KKR Vs DC Preview: వరుస విజయాలతో ఢిల్లీ దూకుడు.. నేడు కోల్ కతా తో మ్యాచ్

KKR Vs DC Preview: వరుస విజయాలతో ఢిల్లీ దూకుడు.. నేడు కోల్ కతా తో మ్యాచ్

IPL 2024 47th Match – KKR Vs DC Match Preview: ఢిల్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. వాళ్లు, వీళ్లని లేదు. అందరినీ రఫ్పాడించేస్తోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. కోల్ కతా నిలకడైన ఆటతీరుతో ముందడుగు వేస్తోంది. భారీ టార్గెట్ లు  ఇస్తోంది. మొన్న  261 పరుగులు టార్గెట్ ఇచ్చింది. కానీ పంజాబ్ ఉఫ్ మని ఊదేసింది. ఇలా దురదృష్టకరంగా జరిగినప్పుడు తప్ప, తన శక్తి మేరకు కోల్ కతా బాగానే ఆడుతోంది.


ఢిల్లీ ఇప్పుడు ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. తనదైన శైలిలో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ ఫుల్ టచ్ లోకి వచ్చాడు. మిగిలినవాళ్లు దుమ్ము రేపుతుండటంతో వరుస విజయాలతో పరుగులు తీస్తోంది.

ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్ లో నేడు రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం పాయింట్ల టేబుల్ పట్టికలో కోల్ కతా టాప్ 2 లో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 6వ స్థానంలో ఉంది.


Also Read: పొట్టి కప్ కోసం కొత్త టీమ్, విలియమ్సన్‌కే పగ్గాలు

ఇంతవరకు రెండు జట్ల మధ్య 33 మ్యాచ్ లు జరిగాయి. కోల్ కతా 17 సార్లు, ఢిల్లీ 15 సార్లు విజయం సాధించాయి. ఈ రకంగా చూసుకుంటే రెండు జట్ల మధ్య పోరు టగ్ ఆఫ్ వార్ గానే కనిపిస్తోంది.

ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంకా ఫామ్ లోకి రాకపోవడం సర్వత్రా ఆందోళనగా మారింది. ప్రథ్వీ షా కూడా ఇంకా భారీ స్కోరు బాకీ ఉన్నాడు. జేక్ ఫ్రేజర్, రిషబ్ పంత్ ఫామ్ లోకి రావడంతో మ్యాచ్ లు నిలబడుతున్నాయి. ట్రిస్టన్ స్టబ్, షయ్ హోప్ చివర్లో సత్తా చూపిస్తున్నారు. బౌలింగులో ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్  వీరితో పటిష్టంగా ఉంది. అందుకే ప్రత్యర్థులను తక్కువ స్కోరుకి నిలువరిస్తున్నారు.

Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్.. భారత జట్టు ఇదే

ఇక కోల్ కతా విషయానికి వస్తే ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, శ్రేయాస్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్ వీళ్లంతా ప్రధాన ఆయుధాల్లా ఉన్నారు. బౌలింగులో కూడా మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ , ఆండ్రీ రసెల్ రాణించడంతో కోల్ కతా వరుస విజయాలతో ముందుకు వెళుతోంది.

పైకి ఇంత బలంగా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య నేడు జరగనున్న పోరులో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×