Big Stories

Hayden On Sanju Samson: అతన్ని వరల్డ్ కప్‌కు తీసుకోండి.. లేదంటే నష్టపోతారు..

Matthew Hayden On Sanju Samson’s Performance: ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది. 9 మ్యాచుల్లో 8 విజయాలతో దూసుకుపోతోంది. కేవలం ఒకే మ్యాచ్‌లో ఓడి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక కెప్టెన్‌గా, బ్యాటర్‌గా సంజూ శాంసన్ అదరగొడుతున్నాడు. 9 మ్యాచుల్లో 385 పరుగులు చేసిన శాంసన్.. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మ్యథ్యూ హేడెన్ శాంసన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

శాంసన్‌ను జాతీయ జట్టులో ఎప్పుడూ విస్మరిస్తున్నారని.. రాబోయే టీ20 ప్రపంచకప్‌కు శాంసన్‌ను దూరం చేస్తే టీమిండియా చాలా నష్టపోతుందని ఈ మాజీ ఆసీస్ ఓపెనర్ చెప్పాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సెలక్షన్ కమిటీకి హేడెన్ సూచించాడు. శాంసన్ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడని అన్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా, కీపర్‌గా అన్ని రంగాల్లో రాణిస్తున్నాడని.. ఇప్పటికైనా అతనికి జాతీయ జట్టులో సముచిత స్థానం కల్పించాలని తెలిపాడు.

- Advertisement -

కాగా ప్రపంచ కప్‌కి టీమిండియాకు వికెట్ కీపర్ల తలనొప్పి ఏర్పడింది. ఆక్సిడెంట్ తర్వాత పంత్ తిరిగి ఫామ్ అందుకుని అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక లక్నో కెప్టెన్ కే ఎల్ రాహుల్ కూడా తనదైన శైలిలో రాణిస్తున్నాడు. కాగా రాహుల్ 378 పరుగులతో, పంత్ 371 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా 430 పరుగులతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా హేడెన్ శాంసన్ అవసరాన్ని నొక్కి చెప్పాడు. లక్నో మీద శాంసన్ ఆడిన ఇన్నింగ్స్‌ను ఆకాశానికి ఎత్తాడు. కేవలం 33 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 71 పరుగులు చేసి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడని ఆసీస్ మాజీ బ్యాటర్ హెడెన్ శాంసన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.

Also Read: అతని వల్లే ఓడిపోయాం.. హార్థిక్ పాండ్యా సంచలన కామెంట్స్..

ఇప్పటికే చాలా సార్లు విస్మరణకు గురైన శాంసన్‌ను అగార్కర్ నేతృత్వంలోని జాతీయ జట్టు సెలక్షన్ కమిటీ అతన్ని ప్రపంచ కప్‌కు సెలక్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News