E-Paper
Advertisement

Bird Flu: వేగంగా వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రంలో గుడ్లు, చికెన్ విక్రయాలపై నిషేధం

Bird Flu: వేగంగా వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రంలో గుడ్లు, చికెన్ విక్రయాలపై నిషేధం
Advertisement

 

Bird Flu: జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తుంది. దీంతో చికెన్, కోడిగుడ్ల విక్రయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రాంచీలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు కనిపించడంతో జార్ఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అదే సమయంలో, కోళ్లు, బాతులలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉందని తేలడంతో ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్ హోత్వార్‌లో 1745 కోళ్లు, 450 బాతులు సహా దాదాపు 2195 పక్షులను చంపేయాలని ఆదేశించింది. రాంచీలోని హోత్వార్‌లో H5N1 బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన తర్వాత రాష్ట్రం మొత్తాన్ని ప్రభుత్వం అలర్ట్ చేసింది. ప్రస్తుతం రాంచీలో కంటైన్‌మెంట్ జోన్‌ను ఏర్పాటు చేశారు. 1 కిలోమీటరు పరిధిలో ఎలాంటి కోళ్లు, బాతులు, గుడ్లు కనిపించినా.. వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ధ్వంసం చేయాలని అడ్మినిస్ట్రేషన్ టీమ్ ఆదేశించింది.

Advertisement

సాధారణ వైరస్‌ల మాదిరిగానే, ఈ వైరస్ జంతువులు, పక్షులతో పాటు మానవులకు కూడా సోకగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, రాంచీలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫారమ్‌లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన వెంటనే, అక్కడ పనిచేస్తున్న పౌల్ట్రీ ఫామ్‌లోని 2 వైద్యులతో సహా 6 మంది ఉద్యోగులు క్వారంటైన్ చేశారు. అంతే కాకుండా పౌల్ట్రీ ఫారం పరిసర ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.

మరోవైపు రాంచీ నుంచి ఇతర నగరాలకు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రాంచీలోని హోత్వార్ ప్రాంతంలో చికెన్, గుడ్ల అమ్మకాలను ప్రభుత్వం వెంటనే నిషేధించింది. అంతే కాకుండా కోళ్లను ఒక చోట నుంచి మరో చోటికి తీసుకురావడం, రవాణా చేయడంపై కూడా పూర్తి నిషేధం విధించింది. అదే సమయంలో చికెన్, గుడ్లు తినవద్దని వైద్యులు సూచించారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×