E-Paper
Advertisement

Sanju-CSK: ధోని గుర్తులు చెరిపేస్తోన్న సంజు… చెన్నైలో అతిపెద్ద క‌టౌట్ల‌తో స‌రికొత్త రికార్డ్‌

Sanju-CSK: ధోని గుర్తులు చెరిపేస్తోన్న సంజు… చెన్నైలో అతిపెద్ద క‌టౌట్ల‌తో స‌రికొత్త రికార్డ్‌
Advertisement

Sanju-CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఐపీఎల్ మొదలైందంటే చాలు క్రీడాభిమానులు వారి వారి అభిమాన జట్లకు మారిపోతారు. ఈ ఐపీఎల్ లో ఉన్న అన్ని జట్లు ఒక లెక్క.. చెన్నై సూపర్ కింగ్స్ {CSK} జట్టు మరొకలెక్క. సీఎస్కే కి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Also Read: India A vs Oman A: ఏంట్రా దీని ఓవరాక్షన్.. టీమిండియా ప్లేయర్ కే బౌలింగ్ వేస్తోంది

Advertisement

చెన్నై జట్టు అంటే ముందుగా అభిమానులందరికీ గుర్తుకు వచ్చేది మహేంద్రసింగ్ ధోని. ఆ తరువాత రవీంద్ర జడేజా. అలాంటి జడేజా ఇప్పుడు చెన్నై జట్టు నుంచి మారిపోయాడు. వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ సంజు శాంసన్ కి బదులుగా ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరణ్ లను రాజస్థాన్ రాయల్స్ {RR} కొనుగోలు చేసింది. రవీంద్ర జడేజా చెన్నైతో 11 సంవత్సరాలు గడిపిన తరువాత ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వెళ్లాడు.

సీఎస్కే కి ధోనీ తర్వాత సంజు అవసరం:

ఐపీఎల్ నుండి మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ కాబోతున్నాడంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ధోని రిటైర్మెంట్ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కి ఓ మంచి వికెట్ కీపర్, బ్యాటర్ అవసరమయ్యాడు. సంజు చెన్నై జట్టులోకి వస్తే వికెట్ కీపర్, బ్యాటర్ తో పాటు కేప్టన్ గా కూడా మంచి అవకాశం. అందుకే చెన్నై మేనేజ్మెంట్ సంజు కోసం ప్రయత్నాలు చేసి అతడిని దక్కించుకుంది. గత సీజన్ ముగిసిన తర్వాత సంజు సీఎస్కే తో క్లోజ్ గా ఉండడం, ధోనితో కలిసి పలు యాడ్స్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ధోనీ తర్వాత.. చెన్నై జట్టుకు సంజు కీలకంగా మారనున్నాడు. మహేంద్రసింగ్ ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా సందర్భాలలో ధోనీ పై వారికి ఉన్న అభిమానాన్ని వారు చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గత సంవత్సరం ధోని జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కటౌట్ అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. నందిగామ మండలం అంబర్పేట గ్రామం వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్కన ధోని 100 అడుగుల కటౌట్ ని ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.

ధోని గుర్తులు చెరిపేస్తున్న సంజు:

Advertisement

సంజు రాజస్థాన్ రాయల్స్ లో ఉన్నప్పుడు కేరళ క్రికెట్ అభిమానులు ఆర్.ఆర్ కి ఎంత మద్దతు ఇచ్చారో.. ఇప్పుడు అదే అభిమానాన్ని చెన్నై సూపర్ కింగ్స్ వైపు మళ్లించాలన్న మేరకు సంజు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో ఉన్న ఓ భారీ కటౌట్ ని నిలబెట్టి.. జట్టులోకి అతడి రాకను పండగలా జరుపుకుంటున్నారు. ఈ మేరకు సంజు కటౌట్ కి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. చెన్నైలో అతిపెద్ద కటౌట్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.

Also Read: Ind vs sa: గంభీర్ మరో ప్రయోగం.. టీమిండియా ప్రాక్టీస్‌లో మిస్టరీ స్పిన్నర్‌.. ఇక దక్షిణాఫ్రికాకు చుక్కలే

తాజాగా మలయాళ డైరెక్టర్, హీరో బసిల్ జోసెఫ్ తో చేసిన ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది సీఎస్కే. ఈ వీడియోలో రాత్రికి రాత్రి పెద్ద హోర్డింగ్ ని తయారు చేసినట్లు చూపించారు. ఇకపై కేరళ కుర్రాళ్ల సపోర్ట్ చెన్నై సూపర్ కింగ్స్ కి ఉంటుందన్న అర్థం వచ్చేలా బసిల్ జోసెఫ్ తో “ఇప్పటినుండి మనవాడు ఎల్లో.. అంటే మనం కూడా” అని చెప్పించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ధోనీకి ఉన్న క్రేజ్ మొత్తం సంజు కి వెళుతుంది. ఫ్యూచర్ లో ధోని ని మరిచిపోయి.. అభిమానులు సంజు జపం చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/WorshipDhoni/status/1991010405863600515?s=20

Related News

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

Big Stories

Advertisement
×