E-Paper
Advertisement

Chamala Kiran Kumar Reddy: వీధి కుక్కల బెడద.. చిన్నారుల ప్రాణాలు పోతున్నాయ్.. ఎంపీ చామల ఆవేదన

Chamala Kiran Kumar Reddy: వీధి కుక్కల బెడద.. చిన్నారుల ప్రాణాలు పోతున్నాయ్.. ఎంపీ చామల ఆవేదన
Advertisement

Chamala Kiran Kumar Reddy: దేశ వ్యాప్తంగా యామిమల్ బర్త్ కంట్రోల్ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ వీధి కుక్కల బెడదతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలోనూ వీధి కుక్కల దాడికి చిన్నారుల ప్రాణాలు పోతున్నాయన్నారు.

తాజాగా భువనగిరి తారకరామనగర్ లో నాలుగేండ్ల బాలుడు ప్రియాన్ష్ వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డారని ఎంపీ చామల గుర్తుచేశారు. మనసు చలించేపోయే విధంగా ఈ ఘటన ఉందన్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఆఫీసర్లకు ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.

Advertisement

మరోవైపు బాలుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. బాలుడి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. హైదరాబాద్ లోని యశోద, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతుందన్నారు. వీధి కుక్కల సమస్యను అరికట్టాల్సిన అవసరం ఉన్నదని ఎంపీ నొక్కి చెప్పారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ముగ్గురు చిన్నారులు రక్తసిక్తమయ్యారు. తారకరామ్‌నగర్‌కు చెందిన సందెల రాహుల్‌కుమార్, శ్రావణి దంపతుల నాలుగేళ్ల కుమారుడు ప్రియాన్ష్ ఇంటి ముందు ఆడుకుంటుండగా, రెండు వీధి కుక్కలు ఒక్కసారిగా అతడిపై విరుచుకుపడ్డాయి. ఈ దాడి ఎంత భీభత్సంగా సాగిందంటే, ఒక కుక్క బాలుడి ముఖంపై దాడి చేసి ఏకంగా కనుగుడ్డును బయటకు పీకేసింది. చిన్నారి ఆర్తనాదాలు విని కుటుంబ సభ్యులు వచ్చేలోపే జరగకూడని నష్టం జరిగిపోయింది.

Advertisement

Also Read: Legislative Sports: రేపే శాసన సభ్యుల క్రీడోత్సవాలు.. ఎల్బీ స్టేడియంలో గేమ్స్.. ఇక అంతా సిద్ధం!

అదే సమయంలో పట్టణంలోని ఆర్‌బీ నగర్‌లోనూ కుక్కలు భయోత్పాతాన్ని సృష్టించాయి. రోడ్డుపై వెళ్తున్న అగర్వాల్, తన్విష్ అనే ఆరేళ్ల ఇద్దరు బాలురను వెంబడించి మరీ వేటాడాయి. తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా వారి కాళ్లపై తీవ్రంగా కరిచి గాయపరిచాయి. గాయపడిన చిన్నారులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం వారు కూడా హైదరాబాద్‌కు తరలివెళ్లాల్సి వచ్చింది. ఒకే రోజు వరుసగా జరిగిన ఈ దాడులతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Also Read: 30 Days Plans 2026: టెలికాం మోసాలకు చెక్.. 28 రోజులు కాకుండా.. పూర్తి నెల వచ్చే ప్లాన్స్ ఇవే!

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×