Danish Kaneria On PAK VS ENG : పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడు టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన ఇంగ్లాండ్…2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇందులో కూడా పాకిస్తాన్ ను ఓడించి వైట్ వాష్ చేసేందుకు సిద్ధమవుతోంది ఇంగ్లాండ్. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ పరువు తీస్తూ, మాజీ క్రికెటర్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ పరిస్థితిపై డానిష్ కనేరియా (Danish Kaneria) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత 70 సంవత్సరాల పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడు తమ జట్టు ఇలా ఆడలేదని పరువు తీశారు. ఒకడంటే ఒక్కడు కూడా సరిగ్గా రావటం లేదని విమర్శలు చేశారు. అసలు పాకిస్తాన్ ప్లేయర్లు క్రికెట్ మర్చిపోయారా ? అన్నట్లుగా అనిపిస్తోందని హేళన చేస్తూ మాట్లాడారు. దీంతో డానిష్ కనేరియా (Danish Kaneria) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. అయితే దీనిపై డానిష్ కనేరియా (Danish Kaneria) తన స్టైల్ లో స్పందించారు. 70 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ క్రికెట్ ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవడం నిజంగా సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. ఇందులో ఎలాంటి సరైన ఎంపిక విధానం లేదా కనీస స్థాయి అట తీరుగానీ కనిపించడం లేదని పాకిస్తాన్ ప్లేయర్లను ఉద్దేశించి మండిపడ్డారు. క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ ఘోరమైన ప్రదర్శన చేసిందని ఆగ్రహించారు. వాళ్ల ఆట చూస్తుంటే తనకు అసహ్యం వేసిందని కామెంట్స్ చేశారు.
తొలి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత రెండో టెస్ట్ మ్యాచ్ లో కచ్చితంగా పుంజుకొని ఆడాలి. అది ఒక సంప్రదాయం. మ్యాచ్ గెలవాలన్న కసి ఉన్న వాళ్లకు మాత్రమే అలాంటి తపన ఉంటుందని వివరించారు. కానీ బాబర్ ఆజం ఆధ్వర్యంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్లేయర్లకు, అసలు పోటీ పటిమ లేదని హేళన చేశారు. రెండు టెస్టులు ఓడిపోతే, టెస్ట్ సిరీస్ కోల్పోతామన్న భయం కూడా పాకిస్తాన్ ప్లేయర్లలో లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెస్టిండీస్ పైన గెలిపించాడని పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ గా బాబర్ ఆజం ను చేశారని వెల్లడించారు. అయితే ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టిన తర్వాత బాబర్ ఆజంను పక్కకు పెట్టారని ఫైర్ అయ్యారు.
మొదటి డ్రెస్ లో సల్మాన్ అలీ అఘా లాంటి అనుభవం లేని ఆటగాడికి కెప్టెన్సీ ఇచ్చి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పుదానం చేసిందని ఫైర్ అయ్యారు. మళ్లీ రెండో టెస్ట్ కు బాబర్ ఆజంను తీసుకురావడం చాలా దారుణం అన్నారు. గాయం పేరుతో అతడిని తప్పించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… అదే గాయం తగ్గకపోయినా బలవంతంగా రెండో టెస్ట్ ఆడించినట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక బాబర్ ఆజం ఆడితేనే పాకిస్తాన్ గెలిచేలా పరిస్థితిలు తయారయ్యాయని వెల్లడించారు. ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ జరుగుతున్న నేపథ్యంలో కోచ్ సర్ఫరాజ్ ను మూడు నెలల కోసం తీసుకువచ్చారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు అతడిని తొలగిస్తామని అంటున్నారని మండిపడ్డారు. ఉమర్ గుల్ ను కూడా తొలగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని వెల్లడించారు.