E-Paper
Advertisement

లీ క్వాన్ యూ ఎవరు? కేసీఆర్‌ను ఆయనతో పోల్చిన కేటీఆర్‌.. అసలు కథ ఇదే!

లీ క్వాన్ యూ ఎవరు? కేసీఆర్‌ను ఆయనతో పోల్చిన కేటీఆర్‌.. అసలు కథ ఇదే!
Advertisement

Lee Kuan Yew:సింగ‌పూర్‌లో లీ క్వాన్ యూను జాతిపిత‌గా కీర్తిస్తారు. అంటే కేసీఆర్‌ను కూడా తెలంగాణ జాతిపిత‌గా పిల‌వాల‌నే త‌న ఆకాంక్షను ఇలా మ‌రోసారి గుర్తు చేశాడ‌న్నమాట కేటీఆర్‌. అంతే కాదు.. సింగాపూర్‌ను లీ .. ప్రపంచ పటంలో పెట్టిన‌ట్టుగానే తెలంగాణ‌ను కూడా కేసీఆర్ త‌న పాల‌న ద్వారా ప్రపంచంలోనే నెంబ‌ర్‌గా నిలిపాడ‌ని గుర్తు చేశారు ఈ సంద‌ర్భంగా. అస‌లు ఈ లీక్వాన్ యూ ఎవ‌రు..? ఆయ‌న నేప‌థ్యం.. ? ల‌భించిన ప్రత్యేక గుర్తింపు ఏమిటీ? అనే చ‌ర్చ ఇప్పుడు కొన‌సాగుతోంది.

ఆధునిక సింగపూర్ పితామహుడు

లీ క్వాన్ యూను ఆధునిక సింగపూర్ పితామహుడు గా పిలుస్తారు. 1959 నుండి 1990 వరకు సుమారు 31 సంవత్సరాల పాటు సింగపూర్ తొలి ప్రధానమంత్రిగా పనిచేశారు. 1965లో మలేషియా నుండి విడిపోయినప్పుడు సింగపూర్‌లో నిరుద్యోగం, పేదరికం ఎక్కువగా ఉండేవి. అలాంటి దేశాన్ని కేవలం ఒకే ఒక్క తరంలో ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ఆయ‌న మార్చారాయ‌న‌. సింగాపూర్‌లో అత్యంత కఠినమైన చట్టాలను అమలు చేసి, అవినీతిని పూర్తిగా నిర్మూలించ‌గ‌లిగార‌ని చెబుతారు. ఈ కార‌ణంగా.. సింగపూర్ ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజలు లీ క్వాన్ యూను దేవుడిలా భావిస్తారు.

గాంధీ ఫోటోల‌తో స‌మానంగా

Advertisement

ఆయ‌న ప్రధాన‌మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నప్పటికీ.. ఆయన కోసం ప్రత్యేకంగా ‘సీనియర్ మినిస్టర్’, ఆ తర్వాత ‘మినిస్టర్ మెంటర్’ పదవులను సృష్టించి 2011 వరకు ప్రభుత్వంలో కొనసాగించారు. లీ క్వాన్ యూ చిత్రపటాన్ని అధికారికంగా గౌరవిస్తారక్కడ‌. ఆయన మార్చి 23, 2015న మ‌ర‌ణించారు.

ALSO READ:రివర్స్ అటాక్.. కొండా అవుట్..!

Advertisement

అప్పుడు వారం రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు. కేటీఆర్ అన్నట్టుగానే .. చాలా సార్లు… కేసీఆర్ కూడా అంత‌ర్గత స‌మావేశాల్లో త‌న‌ను మ‌హాత్మాగాంధీతో పోల్చుకునేవారట. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ ఫోటోల‌తో స‌మానంగా త‌న ఫోటోను కూడా తెలంగాణ‌లో పెట్టుకోవాల‌ని, కానీ రాజ‌కీయాల్లో ఇంకా ఉన్నందుకు .. అంద‌రితో తిట్లు ప‌డుతున్నాన‌ని కూడా చెప్పుకుని బాధ‌ప‌డేవార‌ట‌.

Tags

Related News

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

Big Stories

Advertisement
×