E-Paper
Advertisement

SA vs NZ 1st Semi-Final: సెమీస్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం..ఐడెన్ మార్క్‌రమ్ క్యాచ్ పై వివాదం

SA vs NZ 1st Semi-Final: సెమీస్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం..ఐడెన్ మార్క్‌రమ్ క్యాచ్ పై వివాదం
Advertisement

SA vs NZ 1st Semi-Final:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  సెమీ ఫైనల్ దశ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే బుధవారం న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా ( South Africa vs New Zealand ) మధ్య తొలి సెమీ ఫైనల్ జరుగుతోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens, Kolkata ) వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ అద్భుతంగా రాణించగా.. విజయం దిశగా దూసుకు వెళ్తోంది. అటు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఒక్క ఓటమి ఎరుగని దక్షిణాఫ్రికా మాత్రం.. సెమీ ఫైనల్స్ లో తడపబడింది. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ ( Aiden Markram ) క్యాచ్ ఔట్ వివాదంగా మారింది. దీంతో ఈ సెమీ ఫైనల్ లో ఫిక్సింగ్ జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read : BCCI vs PCB Salary Clash: పాకిస్తాన్ క్రికెట‌ర్ల జీతాలు ఎంతో తెలుసా ? టీమిండియా ప్లేయ‌ర్ల కాలిగోటికి కూడా స‌రిపోవా

ఐడెన్ మార్క్‌రమ్ క్యాచ్ పై వివాదం.. ఫిక్సింగ్ జరిగిందంటూ ఆరోపణలు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament )  భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ ( SA vs NZ 1st Semi-Final ) మధ్య తొలి సెమీ ఫైనల్ జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ మొదట బౌలింగ్ చేయగా, దక్షిణాఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా నిర్ణీత‌ 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన దక్షిణాఫ్రికా, 169 పరుగులు చేసింది. అయితే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ క్యాచ్ ఔట్ కావడం వివాదంగా మారింది. రచిన్ రవీంద్ర బౌలింగ్ లో 18 పరుగుల వద్ద న్యూజిలాండ్ డేంజర్ ఆటగాడు డారెల్ మిచెల్ కు ( Daryl Mitchell ) క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

అయితే ఇది ఔటా? నాటౌటా? అనే చర్చ మొదలైంది. ఐడెన్ మార్క్‌రమ్ కొట్టిన బంతిని మిచెల్ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే బాల్ వేళ్ల మధ్యలో నుంచి నేలను తాకినట్లు రిప్లై లో కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఐడెన్ మార్క్‌రమ్ ఔట్ అంటూ ప్రకటించేశాడు. ఇది ఔట్ కాదని… సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. న్యూజిలాండ్ కు అనుకూలంగా మ్యాచ్ ఫిక్సింగ్ ( Match Fixing) జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. అటు దక్షిణాఫ్రికా క్రికెట్ అభిమానులు కూడా అంపైర్ నిర్ణయంపై సీరియస్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 169 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అద్భుతంగా రాణిస్తోంది న్యూజిలాండ్. ఇప్పటికే వందకు పైగా పరుగులు చేసిన న్యూజిలాండ్, విజయం దిశగా వెళుతోంది. ఈ లెక్కన చూస్తుంటే న్యూజిలాండ్ ఫైనల్ చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

Also Read: Ban On Sanju Samson: సంజుపై ఐసీసీ నిషేధం…సెమీ ఫైన‌ల్ నుంచి ఔట్, ఆ హెల్మెటే కొంప‌ముంచిందా ?

 

 

Related News

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

Big Stories

Advertisement
×