E-Paper
Advertisement

Ban On Sanju Samson: సంజుపై ఐసీసీ నిషేధం…సెమీ ఫైన‌ల్ నుంచి ఔట్, ఆ హెల్మెటే కొంప‌ముంచిందా ?

Ban On Sanju Samson: సంజుపై ఐసీసీ నిషేధం…సెమీ ఫైన‌ల్ నుంచి ఔట్, ఆ హెల్మెటే కొంప‌ముంచిందా ?
Advertisement

Ban On Sanju Samson:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )
సెమీ ఫైనల్ కంటే ముందు టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కోల్ క‌త్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా 97 పరుగులతో రెచ్చిపోయిన సంజు శాంసన్ పై ( Sanju Samson) ఐసీసీ వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ( ICC Cricket Code of Conduct) ప్రకారం అతడు సెమీ ఫైనల్ ఆడకుండా వేటు వేసేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. వెస్టిండీస్ పైన విజయం సాధించిన తర్వాత అతని సెలబ్రేషన్స్ వివాదంగా మారాయని.. ఈ నేపథ్యంలోనే హెల్మెట్ నేలకేసి కొట్టాడని ఐసీసీ ( ICC rules ) గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అతనిపై ఒక మ్యాచ్ వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే జరిగితే ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా సెమీ ఫైనల్ మ్యాచ్ కు సంజు శాంసన్ దూరమవుతాడని అంటున్నారు.

Also Read: T20 World Cup Semi Final Schedule: మార్చి 4 నుంచే సెమీస్ రేస్‌..టీమిండియా షెడ్యూల్ ఇదే, వ‌ర్షం ప‌డితే ఎలా

సంజుపై ఐసీసీ నిషేధం…సెమీ ఫైన‌ల్ నుంచి ఔట్ ?

Advertisement

ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మార్చి 5వ తేదీన రెండవ సెమీఫైనల్ ముంబై వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో సంజు ఆడడంపై సర్వత్ర టెన్షన్ నెలకొంది. వెస్టిండీస్ పై మ్యాచ్ గెలిచిన తర్వాత సంజు శాంసన్ చేసిన సెలబ్రేషన్స్ వివాదంగా మారాయి. మతాలను రెచ్చగొట్టడం, హెల్మెట్ నేలకేసి కొట్టడం, అసభ్యకరంగా తన చేతిని చూపించడం లాంటివి చేశాడు సంజు శాంసన్. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఇవన్నీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. రూల్స్ ప్రకారం అతనిపై వేటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ఇలాంటి పనులు చేస్తే లెవెల్ వన్ తప్పిదంగా పరిగణిస్తారు ఐసీసీ పెద్దలు. దీనివల్ల మ్యాచ్ ఫీజులో కోత, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లను జతపరుస్తారు. అయితే, గడిచిన 12 నెలల్లో మొత్తంగా 4 డీమెరిట్ పాయింట్లు వ‌స్తే మాత్రం సెమీ ఫైన‌ల్ ఆడ‌కుండా సంజు శాంస‌న్ పై వేటు వేయ‌నుంది ఐసీసీ. కానీ గ‌తంలో సంజు శాంస‌న్ ఇలాంటి త‌ప్పిదాలు చేయ‌లేదు. అంటే అత‌నిపై ఒక్క మ్యాచ్‌ నిషేధం విధించే ఛాన్స్ లేదు. కానీ, మతాలను రెచ్చగొట్టడం, అసభ్యకరంగా తన చేతిని చూపించడం లాంటివి చేశాడు సంజు శాంసన్. ఆ ప‌నుల కార‌ణంగా సంజు శాంస‌న్ సెమీస్ ఆడ‌కుండా ఐసీసీ యాక్ష‌న్ తీసుకుంటుంద‌ని అంటున్నారు. మ‌రి దీనిపై ఇవాళ సాయంత్రం లోగా త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌నుంది ఐసీసీ. ఇదే జ‌రిగితే, టీమిండియాకు భారీ షాక్ త‌గల‌నుంది. ఒక వేళ సంజు శాంస‌న్ వేటు ప‌డితే, రింకూ సింగ్ తుది జ‌ట్టులో స్థానం ద‌క్కించుకుంటాడు.

Advertisement

Also Read: T20 World Cup Semi Final Schedule: మార్చి 4 నుంచే సెమీస్ రేస్‌..టీమిండియా షెడ్యూల్ ఇదే, వ‌ర్షం ప‌డితే ఎలా

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×