David Warner: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో డేవిడ్ వార్నర్ ( David Warner ) అలాగే మొయిన్ అలీ ( Moeen Ali ) మధ్య గొడవ జరిగినట్లు నిన్న రాత్రి నుంచి ఒక వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇండియాకు సంబంధించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ పరువు తీస్తూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. అయితే దీనిపై వెంటనే రియాక్ట్ అయ్యారు కరాచీ కింగ్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. ప్రతి విషయంలో పాకిస్తాన్ ను విలన్ చేసే ప్రయత్నం ఇండియా చేస్తోందని.. అక్కడి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు రెచ్చిపోయి పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. మొయిన్ అలీతో ఎలాంటి గొడవ జరగలేదని.. కానీ కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ పద్ధతి మార్చుకుంటే బెటర్ అని చురకలు అంటించారు. దీంతో డేవిడ్ వార్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: IPL 2026: KKRపై సన్ రైజర్స్ బంపర్ విజయం..పాకిస్తాన్ లో సంబరాలు, తగలబడుతున్న బంగ్లాదేశ్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న రావల్పిండి వర్సెస్ కరాచీ కింగ్స్ ( Rawalpindi Pindiz vs Karachi Kings match) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో కరాచీ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అయిన విజయం తర్వాత కరాచీ కింగ్స్ జట్టులో ముసలం నెలకొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కరాచీ కింగ్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అలాగే అదే జట్టుకు సంబంధించిన మోయిన్ అలీ మధ్య గొడవ జరిగినట్లు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో రోజుకో గొడవ జరుగుతోందని.. ఇప్పుడు డేవిడ్ వార్నర్ తన సొంత ప్లేయర్ పైన దాడి చేసేందుకు కుట్రలు పన్నాడని క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
అయితే ఈ ప్రచారం పైన వెంటనే కరాచీ కెప్టెన్ డేవిడ్ వార్నర్స్ స్పందించారు. ఇండియాకు సంబంధించిన సోషల్ మీడియా స్టార్లు గొడవ జరిగిందని పోస్టులు పెడితే, వెంటనే వాళ్లకు కౌంటర్ ఇస్తూ అసలు ముచ్చట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత షేక్ హ్యాండ్ గురించి మేము చర్చించుకున్నాం.. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదు, కానీ గొడవలాగా క్రియేట్ చేసి కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని డేవిడ్ వార్నర్ ఫైర్ అయ్యారు. అయితే గొడవ లాగా ప్రచారం చేసిన వాళ్లగా అకౌంట్లకు కౌంటర్ ఇస్తూ, తొందర పడకండి బ్రదర్ అంటూ రియాక్ట్ అవుతున్నాడు డేవిడ్ వార్నర్. ఏది జరిగినా పాకిస్తాన్ పైన దుమ్మెత్తిపోయడం ఇండియాకు అలవాటైందని పరోక్షంగా హింట్ ఇచ్చారు. వెంటనే తమ జట్టుకు సంబంధించిన వీడియోలను డిలీట్ చేయాలని కూడా కోరారు.
I said to @HaiderAzhar to go first and shake hands 🤣🤣🤣 https://t.co/tiTbSjZIyG
— David Warner (@davidwarner31) April 2, 2026
I want more responses to what people think was being said please 🤡 https://t.co/HJlUlPCfAE
— David Warner (@davidwarner31) April 3, 2026