E-Paper
Advertisement

Delhi Capitals – IPL 2026: ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు.. ఎవ‌రంటే ?

Delhi Capitals – IPL 2026: ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు.. ఎవ‌రంటే ?
Advertisement

Delhi Capitals – IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2026 టోర్నమెంట్ కోసం కొత్త కెప్టెన్ ను తెరపైకి తీసుకురానుందట ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మేరకు జట్టు సభ్యులతో టెలి కాన్ఫరెన్స్ కూడా నిర్వహించినట్లు చెబుతున్నారు. జాతీయ మీడియా కథనం ప్రకారం ఐపిఎల్ 2026 టోర్నమెంటులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా జట్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని ఇప్పటికే ఢిల్లీ యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. అయితే దీనిపై రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సమయంలో అక్షర్ పటేల్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాహుల్ తో కొత్త ప్రయోగం చేయనున్నారు.

Also Read:  T20 World Cup 2026 India Squad: గిల్ పీడ విరగడైంది.. టి20 ప్రపంచ కప్ 2026 ఆడే టీమిండియా జట్టు ఇదే

ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ఎలాగైనా టైటిల్ గెలవాలన్న లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుకు దూసుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే మొదటి మినీ వేలంలో కీలక ప్లేయర్లను తక్కువ ధరకే కొనుగోలు చేసింది ఢిల్లీ యాజమాన్యం. అయితే ఇప్పుడు మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 టోర్నమెంటుకు గాను కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను ఫైనల్ చేయాలని అనుకుంటున్నారట. మొన్నటి వరకు అక్షర్‌ పటేల్ కెప్టెన్ గా వ్యవహరించిన‌ సంగతి తెలిసిందే. అయితే అతని వల్ల పెద్దగా ప్రయోజనం రాకపోవడంతో.. కేఎల్ రాహుల్ తో ప్రయోగం చేస్తున్నారు. దీనికి కెఎల్ రాహుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. గత ఏడాదికాలంగా టీమిండియా తరఫున ఆడుతున్న కేఎల్ రాహుల్, ఇరగదీస్తున్నాడు. అలాగే మొన్న టీమిండియా వన్డే కెప్టెన్ గా కూడా బాధ్యత తీసుకొని జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలోనే అతనికి కెప్టెన్సీ ఇవ్వాలని ఢిల్లీ యాజమాన్యం నిర్ణయం తీసుకుందట.

ఐపీఎల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్ లు ఎప్ప‌టి నుంచి అంటే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ అయింది. ముందుగా మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. ఇప్పుడు ప్రారంభ తేదీలో మార్పు చేసినట్లు తెలుస్తోంది. మార్చి 26వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ నిర్వహించాలని అనుకుంటున్నారట.

Advertisement

DC IPL 2026 స్క్వాడ్: అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్, అజయ్ మండల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టి. నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంతాబ్ చమీరా, ఎ. నిస్సాంక, బెన్ డకెట్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, సాహిల్ పరాఖ్, పృథ్వీ షా, కైల్ జామీసన్

Also Read: Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×