T20 World Cup 2026 India Squad: భారత్, శ్రీలంక వేదికలుగా 2026 ఫిబ్రవరి, మార్చ్ లో జరగనున్న పురుషుల టి-20 వరల్డ్ కప్ కోసం కౌంట్ డౌన్ మొదలైంది. ఈ మెగా టోర్నిలో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం రోజు ముంబైలో సమావేశం అయింది. ఈరోజు మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అధికారికంగా స్క్వాడ్ ని ప్రకటించింది.
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు కిస్సులు ఇచ్చి మరీ రెచ్చగొట్టిన లేడీ.. బలైన దక్షిణాఫ్రికా
ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న ఈ మెగా టోర్ని మార్చి 8 వరకు జరుగుతుంది. ఈ మెగా టోర్నికి రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. భారత్ లోని 5 వేదికలలో.. ఢిల్లీ, ముంబై, కలకత్తా, అహ్మదాబాద్, చెన్నై వేదికలలో మ్యాచ్ లు జరగనున్నాయి.
2026 టి-20 వరల్డ్ కప్ టోర్నీలో మొత్తం 20 జట్లు భాగం కానున్నాయి. భారత్, యూఏఈ, బంగ్లాదేశ్, ఓమన్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, ఐర్లాండ్, నెదర్లాండ్, ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు.. మొత్తం నాలుగు గ్రూపులు టోర్నీలో ఆడతాయి. ప్రతి గ్రూప్ నుండి టాప్ రెండు జట్లు సూపర్ 8 కి అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 7వ తేదీన భారత్ – అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనుంది.
అయితే ఈసారి ఒకే గ్రూప్ {గ్రూప్ – ఏ} లో భారత్ – పాకిస్తాన్ జట్లు ఉండనున్నాయి. దీంతో కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఫైనల్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇవ్వనుంది. కానీ ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఫైనల్ చేరితే తుది పోరుకు కొలంబో ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా అహ్మదాబాద్ లో ఫైనల్ అంటే భారత అభిమానులు కాస్త జంకుతున్నారు. ఎందుకంటే గతంలో ఇదే వేదికగా జరిగిన పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 లో భారత్ ఓడిపోయింది. ఈ క్రమంలో ఫైనల్ ని అచ్చొచ్చిన ముంబై వేదికగా నిర్వహించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: Hardik Pandya-Cameraman: కెమెరామెన్ కు హగ్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. చేయి విరగ్గొట్టి మరీ
సూర్యకుమార్ యాదవ్ ( కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ ( వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ ( వికెట్ కీపర్), సంజు శాంసన్ ( వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్, వాషింగ్‌టన్ సుందర్.
గత కొంతకాలంగా జట్టులో రెగ్యులర్ గా ఉన్న రింకు సింగ్ ని దక్షిణ ఆఫ్రికా సిరీస్ కి ఎంపిక చేయలేదు. కానీ టి20 ప్రపంచ కప్ కి మాత్రం ఎంపిక చేశారు. ఇక ఫామ్ కారణంగా ఇబ్బంది పడుతున్న వైస్ కెప్టెన్ గిల్ ని పక్కన పెట్టారు. మరోవైపు అద్భుతమైన రికార్డు ఉన్న యశస్వి జైష్వాల్ కి కూడా అవకాశం దక్కలేదు.
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2026 announced 🚨
Let's cheer for the defending champions 💪#TeamIndia | #MenInBlue | #T20WorldCup pic.twitter.com/7CpjGh60vk
— BCCI (@BCCI) December 20, 2025