E-Paper
Advertisement

Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్

Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్
Advertisement

Team India Squad: భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య 2026 జనవరిలో జరిగే వన్డే సిరీస్ కి బీసీసీఐ సెలక్టర్లు నేడు జట్టును ప్రకటించారు. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు నేడు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం అయింది. ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం అధికారికంగా స్క్వాడ్ ని ప్రకటించారు సెలెక్టర్.

Also Read: T20 World Cup 2026 India Squad: గిల్ పీడ విరగడైంది.. టి20 ప్రపంచ కప్ ఆడే టీమిండియా జట్టు ఇదే

Advertisement

న్యూజిలాండ్ తో జనవరి 11, 14, 18 తేదీలలో న్యూజిలాండ్ తో వడోదర, రాజ్ కోట్, ఇండోర్ లో భారత్ 3 వన్డేలు ఆడబోతోంది. ఈ వన్డే సిరీస్ ముగిశాక ఐదు టి-20 ల సిరీస్ కూడా ఆడుతుంది. ఈ నేపథ్యంలో రెండు కీలక టోర్నీలకు జట్టును ప్రకటించారు సెలెక్టర్లు. న్యూజిలాండ్ తో టి-20 సిరీస్ లో భాగంగా భారత్.. జనవరి 21, 23, 25, 28, 31వ తేదీలలో ఐదు మ్యాచ్లు ఆడుతుంది. ఈ రెండు సిరీస్ లకి ఎంపిక చేసిన స్క్వాడ్ ని చూద్దాం.

 

న్యూజిలాండ్ తో టి-20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు:

Advertisement

సూర్య కుమార్ యాదవ్ {కెప్టెన్}, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శాంసన్, ఇశాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ {వైస్ కెప్టెన్}, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, జస్ ప్రీత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రానా. టి-20 సిరీస్ లలో ప్రస్తుతం భారత జట్టు ఆధిపత్యం కొనసాగిస్తుంది. తాజాగా సౌత్ ఆఫ్రికా పై సిరీస్ గెలుపుతో ఇండియా వరుసగా ఎనిమిదవ ద్వైపాక్షిక టి-20 సిరీస్ ని సొంతం చేసుకుంది. 2023 డిసెంబర్ నుండి ఈ ఆదిపత్యం కొనసాగుతోంది. మొత్తంగా భారత్ వరుసగా ఇప్పటివరకు 14 సిరీస్ లు { ద్వైపాక్షిక + టోర్నమెంట్} లు గెలిచింది. ఇందులో 2023 ఏషియన్ గేమ్స్, 2024 టి-20 వరల్డ్ కప్, 2025 ఆసియా కప్ కూడా ఉన్నాయి. చివరిసారి టీమిండియా 2023 ఆగస్టులో వెస్టిండీస్ పై 3-2 తేడాతో సిరీస్ కోల్పోయింది.

 

గిల్ కి షాక్ ఇచ్చిన బీసీసీఐ:

టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ గిల్ కి బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. టి-20 ప్రపంచ కప్ కి ప్రకటించిన జట్టులో ఇతడికి చోటు దక్కలేదు. గిల్ స్థానంలో తిరిగి ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ని వైస్ కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. ఈ ఏడాది ఆసియా కప్ తో తిరిగి టి-20 జట్టులోకి వచ్చిన గిల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్ ల సిరీస్ లో కూడా దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఆఖరి 2 టి-20 లకు గాయం పేరిట అతడిని మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. అతడి స్థానంలో చివరి టి-20కి జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు కిస్సులు ఇచ్చి మ‌రీ రెచ్చ‌గొట్టిన లేడీ.. బ‌లైన ద‌క్షిణాఫ్రికా

దీంతో ఇకనుండి సంజు ని ఓపెనర్ గా కొనసాగించాలని సెలెక్టరు నిర్ణయించారు. అగర్కర్ కూడా గిల్ పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడని.. గత టి-20 వరల్డ్ కప్ లో కూడా అతడు సరిగ్గా ఆడలేదని వెల్లడించాడు. మరోవైపు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ రెండు సంవత్సరాల తర్వాత భారత జట్టుకు ఎంపిక అయ్యాడు. సౌత్ ఆఫ్రికాతో ముగిసిన 5 టి-20 ల సిరీస్ లో వికెట్ కీపర్ గా వ్యవహరించిన జితేష్ శర్మ పై సెలెక్టర్లు వేటు వేశారు. అతడి స్థానంలో సెకండ్ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ ని సెలెక్ట్ చేశారు. రీసెంట్ గా సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించడం వల్ల అతడిని ఎంపిక చేసినట్లు సమాచారం.

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×