E-Paper
Advertisement

Eng vs Aus 2nd Test: మీ దుంపలు తెగ.. గ్రౌండ్ లోనే రొమాన్స్ చేస్తున్నారు కదరా!

Eng vs Aus 2nd Test: మీ దుంపలు తెగ.. గ్రౌండ్ లోనే రొమాన్స్ చేస్తున్నారు కదరా!
Advertisement

Eng vs Aus 2nd Test: యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. ఇక రెండవ రోజు ఆటలో మిగిలిన ఒక వికెట్ ని కోల్పోయి మరో తొమ్మిది పరుగులు జోడించి మొత్తం 334 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది.

Also Read: Ind vs Sa Odi Series: టీమిండియా ప్లేయర్లకు ఘోర అవమానం.. ఇలాంటి వెధవ పనులు చేసినందుకే కోహ్లీ లండన్ పారిపోయాడు !

Advertisement

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో జో రూట్ {138*} పరుగులు చేయగా.. ఓపెనర్ జాక్ క్రాలీ 76 పరుగులతో రెండవ హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఇన్నింగ్స్ చివర్లో మెరుపులు మెరిపించిన జొఫ్రా ఆర్చర్ 38 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ ఇన్నింగ్స్ లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. అలాగే మైఖేల్ నేసర్, స్కాట్ బోల్యాండ్, డకెట్ చెరో వికెట్ పడగొట్టారు.

 

అద్భుతమైన క్యాచ్.. కానీ మైదానంలోనే రొమాన్స్:

Advertisement

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో 67వ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్.. 4వ బంతిని అట్కిన్సన్ కి లెంగ్త్ డెలివరీ గా సంధించాడు. ఆ బంతిని అట్కిన్సన్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బంతి బ్యాట్ ఎడ్జ్ తగిలి గాల్లోకి లేచింది. ఆ బంతి కీపర్ వెనకకు వెళ్ళగా.. దాన్ని పట్టుకునేందుకు కారీ వేగంగా పరిగెత్తుకెళ్ళాడు. మరోవైపు నుండి లబుషేన్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక బాల్ కిందికి రాగానే దానికోసం ఇద్దరూ డైవ్ చేశారు. అయితే కారీ మాత్రం అద్భుతంగా డైవ్ చేసి బంతిని అందుకోగలిగాడు. కారీ డైవ్ చేసే సమయంలో లబుషేన్ అతడిని ఢీకొన్నప్పటికీ.. కారీ మాత్రం బంతిని విడిచిపెట్టలేదు. ఈ క్యాచ్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. కింద పడిన తర్వాత అతడి పక్కన ఉన్న లబుషేన్ కూడా కారీని అభినందించాడు. అలా అభినందిస్తూ అతడిని హత్తుకొని ముద్దు పెట్టాడు. అయితే ఈ అద్భుతమైన క్యాచ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన క్రీడాభిమానులు.. క్యాచ్ అద్భుతంగా ఉంది కానీ.. ఈ రొమాన్స్ ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

 

క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన క్యాచ్ లు:

క్రికెట్ లో క్యాచులు సాధారణంగానే కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు కష్టతరమైన క్యాచ్ లను ఆటగాళ్లు అద్భుతంగా అందుకున్నప్పుడు.. సూపర్ క్యాచ్, అద్భుతమైన క్యాచ్ అని మెచ్చుకుంటాము. అలాంటి ఎన్నో అద్భుతమైన క్యాచ్ లు క్రికెట్ చరిత్రలో ఉన్నాయి. ఇటీవల ఇలాంటి అద్భుతమైన క్యాచ్ లు ఎన్నో క్రికెట్ చరిత్రలో జరుగుతున్నాయి. అలాంటి వాటిల్లో ఈ క్యాచ్ కూడా ఒకటి. కారీ తీసుకున్న ఈ క్యాచ్ క్రికెట్ అభిమానులు అందరినీ ఆశ్చర్యపరిచింది.

Also Read: Travis Head: ఐపీఎల్ ఇక చాలు..PSLలో ఆడ‌తా, కాటేర‌మ్మ కొడుకు హెడ్ ప్ర‌క‌ట‌న !

ఇక రెండవ రోజు తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతానికి ఐదు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో హెడ్ 33, వెదర్లాడ్ 72, లబుషేన్ 65, స్మిత్ 61, గ్రీన్ 45 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్సే 3, బెన్ స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు.

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×