E-Paper
Advertisement

Punarnavi Bhupalam: ప్రియుడిని పరిచయం చేసిన బిగ్ బాస్ పునర్నవి.. త్వరలోనే పెళ్ళంటూ!

Punarnavi Bhupalam: ప్రియుడిని పరిచయం చేసిన బిగ్ బాస్ పునర్నవి.. త్వరలోనే పెళ్ళంటూ!
Advertisement

Punarnavi Bhupalam:పునర్నవి భూపాలం పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్న సమయంలో విపరీతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ 3 సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్న పునర్నవి ఈ కార్యక్రమంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో నడిపిన లవ్ ట్రాక్ కారణంగా భారీగా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ నిజంగానే రిలేషన్ లో ఉన్నారా ?పెళ్లి చేసుకోబోతున్నారా? అన్న సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి కానీ అవన్నీ నిజం కాదని తెలుస్తోంది.

కాశ్మీరీ కొండల్లో లవ్ ప్రపోజల్..

ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పునర్నవి పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు శుభవార్తను తెలియజేశారు. తాజాగా తన ప్రియుడిని అందరికీ పరిచయం చేయడమే కాకుండా తను ప్రపోజ్ చేయడంతో ఎస్ చెప్పానంటూ తన ప్రేమ గురించి అభిమానులతో పంచుకున్నారు. ఇలా కాశ్మీరీ కొండల్లో తన ప్రియుడు తనకు ప్రపోజ్ చేస్తూ వేలికి ఉంగరం తొడుగుతున్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

సింగర్ రాహుల్ తో లవ్ ట్రాక్..

Advertisement

ఇలా ప్రియుడిని పరిచయం చేసిన పునర్నవి త్వరలోనే పెళ్లికి సంబంధించిన శుభవార్తను కూడా తెలియజేయబోతున్నారని తెలుస్తోంది.. ఇలా తన ప్రియుడిని పరిచయం చేయడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా పున్ను పాపకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఈమె తన ప్రియుడిని పరిచయం చేయడంతో మరోసారి రాహుల్ సిప్లిగంజ్ వార్తల్లో నిలిచారు ఇటీవల ఈయన హరిణ్య రెడ్డి అనే అమ్మాయితో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే. గతంలో రాహుల్ పునర్నవి ఇద్దరు పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు కానీ రాహుల్ మాత్రం ఆయన ప్రేమించిన అమ్మాయితో వివాహం చేసుకున్నారు.

Advertisement

ఇలా రాహుల్ పెళ్లి జరిగిన వెంటనే పునర్నవి కూడా తన ప్రియుడిని పరిచయం చేయడంతో మరోసారి వీరిద్దరు వార్తలు నిలుస్తున్నారు. ఇక పునర్నవి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరు? తన బ్యాగ్రౌండ్ ఏంటి ? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ఈమె బిగ్ బాస్ కంటే ముందుగా పలు సినిమాలలో నటించారు. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ అవికా ఫ్రెండ్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలతో పాటు పిట్టగోడ, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, మనసుకు నచ్చింది వంటి పలు సినిమాలలో నటించారు. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.. ఇటీవల ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పునర్నవి ఉన్నత చదువులు నిమిత్తం విదేశాలకు వెళ్లడంతోనే వెండి తెర, బుల్లితెరకు కాస్త దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

Also Read: Show Man Film: రామ్ గోపాల్ వర్మ హీరో – సుమన్ విలన్‌గా షో మ్యాన్ సినిమా

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×