England vs Pakistan: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) సూపర్ 8 మ్యాచ్ లు చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Pakistan) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. శ్రీలంకలోని పల్లెకేలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Pallekele International Cricket Stadium, Pallekele) వేదికగా ఈ రెండు జట్ల మధ్య ఫైట్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. పాకిస్తాన్ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేదించింది ఇంగ్లాండ్. 19.1 ఓవర్లలో పాకిస్తాన్ విధించిన లక్ష్యాన్ని 8 వికెట్లు నష్టపోయి ఛేదించింది ఇంగ్లాండ్. దీంతో పాక్ పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే సూపర్ 8 లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే, సెమీ ఫైనల్ కు తీసుకువెళ్ళింది ఇంగ్లాండ్.
టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 లో భాగంగా శ్రీలంకలోని పల్లె కేలే ( Pallekele International Cricket Stadium, Pallekele) వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్ణిత 20 ఓవర్లు ఆడింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే తొమ్మిది వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్ 164 పరుగులు సాధించగలిగింది. పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫర్హాన్ ఒక్కడే వన్ మ్యాన్ షో నడిపించాడు. ఈ మ్యాచ్ లో 45 బంతుల్లో 63 పరుగులు సాధించాడు ఫర్హాన్. ఇందులో రెండు సిక్సర్లతో పాటు ఏడు బౌండరీలు కూడా ఉన్నాయి.
అటు బాబర్ ఆజం 25 పరుగులు చేయగా ఫకర్ జమాన్ 25 పరుగులతో రాణించాడు. అటు షాబాద్ ఖాన్ 23 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగిలిన ఆటగాళ్లు విఫలమయ్యారు. ఇక పాకిస్తాన్ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇంగ్లాండ్ అద్భుతంగా రానించి గెలిచింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ( Harry Brook ) సెంచరీ తో రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్ లో 51 బంతుల్లో సెంచరీ నమోదు చేసుకున్నాడు హ్యారీ బ్రూక్. ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే 10 బౌండరీలు ఉన్నాయి. టి20 ప్రపంచ కప్ చరిత్రలో కెప్టెన్ గా సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు హ్యారీ బ్రూక్. అటు చివరలో బౌండరీ బాది, ఇంగ్లాండ్ ను గెలిపించాడు ఆర్చర్.
శ్రీలంక వేదికగా జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఇందులో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. దీంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు మరింత సన్నగిల్లిపోయాయి. ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ మూడవ స్థానానికి పడిపోయింది. అలాగే పాకిస్తాన్ రన్ రేట్ మైనస్ లో ఉంది. -0.461 రన్ రేట్ తో కొనసాగుతోంది పాక్. మరో మ్యాచ్ శ్రీలంకతో పాకిస్తాన్ ఆడాల్సి ఉంది. ఆ జట్టు పైన విజయం సాధించిన కూడా, న్యూజిలాండ్ తన రెండు మ్యాచ్ లు ఓడిపోవాలి. అలా అయితేనే పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇది ఏది జరగకపోయినా పాకిస్తాన్ ఇంటిదారి పట్టాల్సిందే.
🚨 ENGLAND COOKED PAKISTAN AND QUALIFIED FOR SEMIFINAL 🚨
– England's Captain Harry Brook bashing Pakistan bowler all over the park and won the match by 2 wickets.
– Now Pakistan most likely eliminated from the T20 World Cup 2026. pic.twitter.com/PccuMph8N3
— Cricket Central (@CricketCentrl) February 24, 2026