E-Paper
Advertisement

కామన్వెల్త్ గేమ్స్‌-2026లో షాకింగ్ ఘటన.. గాల్లో విన్యాసాలు, పట్టు తప్పి కిందపడిన జిమ్నాస్ట్

కామన్వెల్త్ గేమ్స్‌-2026లో షాకింగ్ ఘటన.. గాల్లో విన్యాసాలు, పట్టు తప్పి కిందపడిన జిమ్నాస్ట్
Advertisement

Commonwealth Games-2026: ఆటల్లో కెల్లా జిమ్నాస్టిక్స్ గేమ్ చాలా డేంజర్ అని చెబుతుంటారు. అంతా గాల్లో చేసే విన్యాసాలు కావడంతో తేడా వస్తే ఆట లేమోగానీ, ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందని క్రీడా నిపుణులు చెబుతుంటారు. సరిగ్గా గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026 గేమ్స్ అదే జరిగింది. ఓ ఇంగ్లీష్ జిమ్నాస్ట్ తన ప్రదర్శనను పూర్తి చేస్తుండగా చేయి జారిపోయి తల కిందులుగా నేలపై పడిపోయాడు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు.

కామన్వెల్త్ గేమ్స్-2026- శుక్రవారం గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2026 గేమ్స్ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పురుషుల టీమ్ జిమ్నాస్టిక్స్ ఫైనల్ సందర్భంగా ఇంగ్లాండ్‌కు చెందిన 19 ఏళ్ల జిమ్నాస్ట్ గాబ్రియేల్ లాంగ్టన్‌ భయంకరమైన ప్రదర్శన చేశాడు. చివరి రొటేషన్ సమయంలో బార్‌పై పట్టు కోల్పోయి తలకిందులుగా నేలపై పడ్డాడు. ఆ ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే ఆ సమయంలో మైదానం నిశ్శబ్దం అలముకుంది. తోటి ఆటగాళ్లు, ప్రేక్షకులు నివ్వెరపోయారు. కొన్ని నిమిషాల పాటు లాంగ్టన్ నేలపై అలాగే ఉండిపోయాడు… కనీసం లేవలేకపోయాడు.

Advertisement

షాకైన ఆటగాళ్లు-ఈలోగా ఇరువైపులా ఉన్న అంపైర్లు వచ్చి చూసి షాకయ్యారు. వెంటనే వైద్య సిబ్బంది పిలిచారు. వారు పరుగెత్తుకుని మైదానంలోకి వచ్చారు. వైద్య బృందం లాంగ్టన్‌కు అక్కడికక్కడే చికిత్స చేశారు. అప్పటికీ అతడు మెడ-తలను స్థిరంగా ఉంచలేకపోయాడు. సపోర్ట్ అమర్చిన తర్వాత ఆ క్రీడాకారుడ్ని స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది లాంగ్టన్‌కు చికిత్స అందిస్తుండగా పలువురు జిమ్నాస్ట్‌లు కలత చెందారు. చికిత్స అందిస్తున్నప్పుడు పోటీని నిలిపివేశారు.

కాసేపు నిలిపివేసిన పోటీలు-ఈ ఘటనతో పోటీని కొద్దిసేపు తాత్కాలికంగా నిలిపివేశారు. మిగతా ఆటగాళ్ల తమ దృష్టి అంతా సహచరుడి కేంద్రీకరించారు. ఆ దృశ్యం ఆ ప్రాంగణాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆరుసార్లు ఒలింపిక్ పతక విజేత మాక్స్ విట్‌లాక్ స్థానంలో లాంగ్టన్‌ను ఇంగ్లాండ్ జట్టులోకి తీసుకుంది. వరుసగా నాలుగోసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల టీమ్ టైటిల్ కోసం ఇంగ్లాండ్ ప్రయత్నిస్తున్న చివరి రౌండ్‌లో అనుకోకుండా లాంగ్టన్‌ గాయపడ్డాడు. ఈ ఘటన జరిగినప్పటికీ ఇంగ్లీష్ అథ్లెట్లు పోటీలో పాల్గొనలేదు. ఈ విభాగంలో కెనడా స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇంగ్లాండ్ రజత పతకం, ఆస్ట్రేలియా కాంస్య పతకాలతో సరి పెట్టుకున్నాయి.

Advertisement

ALSO READ: ముఖం మీద ఉమ్మేసినా, తుడిచేసుకుంటోన్న‌ షాహీన్ అఫ్రిది

లాంగ్టన్‌కు ఆసుపత్రిలో పలుమార్లు స్కాన్‌లు చేశారు. వాటి ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని బ్రిటిష్ జిమ్నాస్టిక్స్ విభాగం ధృవీకరించింది. తీవ్రమైన గాయాలు లేవని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  ఇంగ్లాండ్ వైద్య బృందం పర్యవేక్షణలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి హోటల్‌కు చేరుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు రజత పతకాలు అందుకున్నప్పుడు లాంగ్టన్ అక్కడ లేడు.

 

Related News

2023 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియాను గెలిపించేందుకు కుట్ర‌లు చేశారు!

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

పీక‌ల‌దాకా తాగుతూ నైట్ క్ల‌బ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెట‌ర్లు

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్

నా చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైంది – మాలిక్

పాకిస్తాన్ జ‌ట్టు నుంచి పిలుపు..అంత‌లోనే ఫోన్ స్విచ్ ఆఫ్, పాస్ పోర్టు లేదు..కానీ కట్ చేస్తే

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

Big Stories

Advertisement
×