E-Paper
Advertisement

ముఖం మీద ఉమ్మేసినా, తుడిచేసుకుంటోన్న‌ షాహీన్ అఫ్రిది

ముఖం మీద ఉమ్మేసినా, తుడిచేసుకుంటోన్న‌ షాహీన్ అఫ్రిది
Advertisement

Shaheen Afridi LPL controversy:  పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అల్లుడు షాహీన్ అఫ్రిది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం బౌలర్ గా షాహీన్ అఫ్రిదికి మంచి పేరు ఉంది. ఒంటి చేత్తో పాకిస్తాన్ జట్టును గెలిపించే సత్తా అతడికి ఉంది. అంతేకాదు పాకిస్తాన్ జట్టుకు అవసరమైనప్పుడు కెప్టెన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు షాహీన్ అఫ్రిది. అయితే అలాంటి షాహీన్ అఫ్రిది ప్రస్తుత పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో పాటు విదేశీ టోర్నమెంట్స్ లలో అతడు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. లేటెస్ట్ గా లంక ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో కూడా అతనికి ఘోర అవమానం ఎదురయింది. అక్కడ జరిగిన అవమానానికి టోర్నమెంట్ మధ్యలోనే వచ్చేందుకు షాహీన్ అఫ్రిది నిర్ణయం తీసుకున్నాడు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

ముఖం మీద ఉమ్మేసినా, తుడిచేసుకున్న షాహీన్ అఫ్రిది

Advertisement

లంకా ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో షాహీన్ అఫ్రిది ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా కాండీ రాయల్స్ ( Kandy Royals) జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇప్పటికే బౌలింగ్ స్పీడ్ తగ్గించిన షాహీన్ అఫ్రిది… దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో కాండీ రాయల్స్ ( Kandy Royals) జట్టులో షాహీన్ అఫ్రిది ఆడడం లేదని.. ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ప‌నికిరాడ‌న్న‌ట్లు వ్యవహారం నడిచింది. దీంతో షాహీన్ అఫ్రిది బాగా హర్ట్ అయ్యాడు. అసలేం జరిగిందంటే.. లంక ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో భాగంగా క్యాండీ రాయల్స్ తరఫున ఆడుతున్న షాహీన్ అఫ్రిది… ఓ వివాదానికి తెర లేపాడు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో అనలిస్టు పొరపాటు వల్ల ఇంపాక్ట్ ప్లేయర్ గా తన పేరును చేర్చలేదు. దీంతో అసహనం వ్యక్తం చేశారు పాకిస్తాన్ ప్రీమియర్ బౌలర్ షాహీన్ అఫ్రిది. అంతేకాదు లంకా ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన యాంటీ కరప్షన్ యూనిట్ కు కూడా ఫిర్యాదు చేశారు.

ఫ్రాంచైజీ అలాగే నిర్వాహకులు తనను చీప్ గా చూస్తున్నారని.. ఈగలాగా తీసి పడేస్తున్నారని నివేదిక తయారు చేసి మరి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై లంకా ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ యాజమాన్యం చాలా సీరియస్ అయింది. ఈ క్రమంలో క్యాండీ రాయ‌ల్స్ యాజమాన్యం.. పాకిస్తాన్ ఆటగాడు షాహీన్ అఫ్రిదికి క్షమాపణలు చెప్పింది. దీంతో మనసు మార్చుకున్న షాహీన్ అఫ్రిది ఎప్పటి లాగే ఆ జట్టులో కొనసాగుతున్నాడు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రీమియర్ బౌలర్ గా చెప్పుకుంటున్న షాహీన్ అఫ్రిది ఈ మధ్యకాలంలో 120 స్పీడ్ తోనే బంతులు వేస్తున్నాడు. అంటే స్పిన్నర్ కంటే దారుణమన్న మాట. ఈ క్రమంలోనే అతన్ని ఎందుకు కొనుగోలు చేశామని కాండీ రాయల్స్ ( Kandy Royals) యాజమాన్యం పునరాలోచనలో పడిందట.

Advertisement

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

 

 

Related News

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

వైభ‌వ్ సూర్య‌వంశీ మాములోడు కాదు.. లిఫ్ట్ లోనే అమ్మాయితో రొమాన్స్ ?

మ‌రో అమ్మాయితో శ్రేయాస్ అయ్య‌ర్ రిలేష‌న్‌..షాకింగ్ వీడియో వైర‌ల్

ఫైన‌ల్స్ లో చివ‌రి ఓవ‌ర్ వేయాల‌ని ధోని టార్చ‌ర్ చేశాడు

బీసీసీఐ డ‌బ్బుల‌తో కులుకుతూ, లండ‌న్ జ‌ల్సాలు..కోహ్లీపై కైఫ్ సీరియ‌స్‌

పాక్ డ్రెస్సింగ్ రూంలో టీమిండియా క్రికెట‌ర్లు న‌మాజ్ చేసేవాళ్లు !

ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ లో టీమిండియాకు న‌ర‌కం చూపిస్తాం..రియాజ్ హెచ్చ‌రిక‌

క్రికెట్ ఆడటం చేతకాదా ? అంటూ నన్ను సచిన్ అవమానించాడు

Big Stories

Advertisement
×