E-Paper
Advertisement

AB డివీలియర్స్ లాగా ఆడి, టీమిండియాను చిత్తుగా ఓడిస్తా

AB డివీలియర్స్ లాగా ఆడి, టీమిండియాను చిత్తుగా ఓడిస్తా
Advertisement

Fakhar zaman On AB de Villiers: పాకిస్తాన్ క్రికెటర్లు ఏది చేసినా వైరల్ అవుతూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ క్లాసులకు హాజరవుతున్న పాకిస్తాన్ క్రికెటర్లు… 2027 వన్డే వరల్డ్ కప్ కోసం కూడా సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే అమెరికాలో హిట్టింగ్ కూడా నేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ స్టార్ ఆటగాడు ఫఖ‌ర్ జమాన్ (Fakhar zaman). ఏబీ డివీలియర్స్ (AB de Villiers) తరహాలో భయంకరమైన షాట్లు ఆడి, టీమ్ ఇండియాను చిత్తుగా ఓడిస్తానని శపధం చేశారు. 360 డిగ్రీ షాట్లు ఆడి మరి.. టీమిండియా బౌలర్లకు నరకం చూపిస్తానని హెచ్చరించారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో తన తడాఖా చూపిస్తానని సవాల్ విసిరారు ఫఖ‌ర్ జమాన్.

Also Read: Sikandar Raza Warns Team India: మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

AB డివీలియర్స్ లాగా ఆడి, టీమిండియాను చిత్తుగా ఓడిస్తా

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) దగ్గర పడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఒకప్పటి స్టార్ ఓపెనర్ ఫఖ‌ర్ జమాన్… ఈ మేరకు టోర్నమెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఎప్పటి లాగే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకొని.. ప్రయాణాన్ని ముందుకు సాగించాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఇందులో భాగంగానే లేటెస్ట్ గా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్వరూపంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలవుతోందని.. ఇకపై అలాంటి పరిస్థితులు ఉండబోవని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇకపై దూకుడుగా ఆడతామని వెల్లడించారు. తాను చాలా రోజుల నుంచి ఏబీ డివీలియర్స్ బ్యాటింగ్ చూస్తున్నానని.. అతడు అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. ఏబీ డివీలియర్స్ ఆడే షాట్లు అద్భుతమని కొనియాడారు. ఆయనలాగా 360 డిగ్రీస్ షాట్స్ ఆడడమే లక్ష్యమన్నారు. వ‌న్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాతో మ్యాచ్ జరిగితే.. ఏబీ డివీలియర్స్ లాగా రెచ్చిపోతానని తెలిపారు ఫఖ‌ర్ జమాన్.

ఇంజ‌మామ్ అల్లుడిని అవమానించిన ఫ‌ఖ‌ర్ జ‌మాన్

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్ అల్లుడు ఇమామ్ పరువు తీశాడు ఫఖ‌ర్ జమాన్. ఇదే పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. ఇంజమామ్ తరహా లోనే ఇమామ్ కూడా జిడ్డు గాడు అంటూ హేళన చేశారు. వికెట్ల మధ్య పరిగెత్తడం కూడా అతడికి చేతకాదని పరువు తీశారు. అతనితో బ్యాటింగ్ చేయడం అంటే నరకం తో సమానం అంటూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పరుగు కోసం రమ్మని పిలిస్తే.. 30 నిమిషాల తర్వాత నిద్ర లేస్తాడని ఇమామ్ పరువు తీశారు పాకిస్తాన్ ఒకప్పటి స్టార్ ఓపెనర్ ఫఖ‌ర్ జమాన్.

Advertisement

 

Also Read: MI London vs Sunrisers Leeds, 1st Match: కావ్య పాప‌కు బిగ్ షాక్‌…స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లు చూడకుండా కుట్ర‌లు !

 

Related News

బౌలింగ్ స‌రిగ్గా చేయ‌లేద‌ని ధోని ప‌చ్చిబూతులు తిట్టాడు, లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించాడు

టీమిండియా చేతిలో ఓడినందుకు మాపై కుళ్ళిన గుడ్లు, టమోటాలు విసిరారు

పాకిస్తానోడి సిక్స‌ర్లు..కావ్య పాప సంబ‌రాలు…మ‌ళ్లీ దేశ‌ద్రోహి అంటూ పోస్టులు

ర్యాంకింగ్స్ లో అట్ట‌డుగున ఉన్న పాకిస్తాన్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం అసాధ్యం

కావ్య పాప‌కు బిగ్ షాక్‌…స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లు చూడకుండా కుట్ర‌లు !

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

Big Stories

Advertisement
×