E-Paper
Advertisement

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్
Advertisement

Sikandar Raza Warns Team India:  టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య మరో రెండు రోజుల్లో టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ చేతుల్లో అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది శ్రేయస్ అయ్యర్ సేన. ఇలాంటి నేపథ్యంలో జింబాబ్వేతో మూడు టి20 సిరీస్ కోసం సిద్ధమైంది టీమిండియా. ఇందులో భాగంగానే జింబాబ్వేకు చేరుకున్న టీమిండియాను ఉద్దేశించి కెప్టెన్ సికందర్‌ రాజా (Sikandar Raza) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆస్ట్రేలియానే ఓడించామ‌ని, అలాంటిది టీమిండియా ఓడించ‌లేమా ? అంటూ ప్ర‌శ్నించారు. త‌మ‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్దు అంటూ హెచ్చ‌రించారు సికంద‌ర్ రాజా.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం

Advertisement

టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య గురువారం నుంచి 3 టీ20 ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే నిన్న జింబాబ్వేకి చేరుకున్న టీమిండియా జట్టు.. ప్రాక్టీస్ కూడా చేస్తోంది. ఇంగ్లాండ్ అలాగే ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా… జింబాబ్వేను మట్టి కల్పించేందుకు సిద్ధమైంది. ఇలాంటి క్రమంలో టీమిండియా అంచనాలకు భిన్నంగా జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా కీలక ప్రకటన చేశారు. తమను టీమిండియా తక్కువగా అంచనా వేస్తోందని.. వెల్లడించారు. తాము కూడా టీమిండియా లెవెల్ కు సమానంగా ఉన్నామన్నారు. అందులో సీనియర్ క్రికెటర్లు లేరు కాబట్టి.. టీమిండియాను తాము ఓడించే అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. కుదిరితే వైట్ వాష్ కూడా చేస్తామని హెచ్చరించారు. గతంలో ఆస్ట్రేలియా జట్టును కూడా మట్టి కల్పించామని గుర్తు చేశారు. అలాంటిది టీం ఇండియా మీద లెక్క కాదని తేల్చి చెప్పారు సికందర్ రాజా.

వైభవ్ సూర్యవంశీని తక్కువగా అంచనా వేయబోం

జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగే టి20 సిరీస్ నేపథ్యంలో మూడు మ్యాచ్ లలో వైభవ్ ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో వైభవ్ ఎక్కువ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు సికందర్ రాజా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఈ 15 ఏళ్ల కుర్రాడు అద్భుతంగా రాణించాడని… తమపై కూడా అతడు అద్భుతంగా ఆడతాడని టీమిండియా అంచనాలు పెట్టుకుందని తెలిపారు. అయితే అతడిని మేము తక్కువగా అంచనా వేయబోమని.. వైభవ్ కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఎలాగైనా టీం ఇండియాను ఓడించి తీరుద్దామని హెచ్చరించారు.

టీమిండియా వర్సెస్ జింబాబ్వే టి20 సిరీస్ షెడ్యూల్

Advertisement

టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య జూలై 23వ తేదీన మొదటి టీ20 జరగనుంది. 25వ తేదీన రెండవ మ్యాచ్ జరగనుండగా… చివరిది 26వ తేదీన నిర్వహిస్తారు. ఈ మ్యాచ్ లో ఒకే వేదికగా హరారే లో జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగున్నరకు మ్యాచులు కొనసాగలు ఉన్నాయి. జింబాబ్వే టైమింగ్స్ ప్రకారం ఉదయం 11 గంటలకు మ్యాచులు ఉంటాయి.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ క‌ట్టప్ప‌లే..అందుకే సంక‌నాకిపోతున్నారు

టీమిండియా తిక్క కుదరాలంటే, నఖ్వీకి ఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వండి..!

వివాదంగా మారిన టీమిండియా జెర్సీ..కాషాయ రంగుపై విమ‌ర్శ‌లు !

పాకిస్తాన్ కోచ్ లుగా షోయ‌బ్ అక్త‌ర్‌, అఫ్రిదిల‌ను పెట్టుకోండి..!

ఈ టార్చ‌ర్ నా వ‌ల్ల కాదు..ఐపీఎల్ 2027 మ‌ధ్య‌లోనే త‌ప్పుకుంటా !

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టి కొట్టిన BBL…టైం చూసి దెబ్బేశారు

రాసి పెట్టుకోండి.. ఎప్పుడు, ఎక్క‌డ మ్యాచ్ జ‌రిగినా మాదే విజ‌యం

క‌ళ్లు మూసుకుని బ్యాటింగ్ చేస్తావా ? అంటూ అభిషేక్ కు యూవీ పనిష్ మెంట్

Big Stories

Advertisement
×