E-Paper
Advertisement

Vaibhav-Praful Hinge: వైభ‌వ్ సూర్య‌వంశీ, ప్రఫుల్ హింగే‌ మ‌ధ్య గొడ‌వ‌..దాడికి య‌త్నం !

Vaibhav-Praful Hinge: వైభ‌వ్ సూర్య‌వంశీ, ప్రఫుల్ హింగే‌ మ‌ధ్య గొడ‌వ‌..దాడికి య‌త్నం !
Advertisement

Vaibhav-Praful Hinge:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్ బుధవారం రోజున సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals, Eliminator) మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అందరూ ఊహించినట్లుగానే మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు నమోదు చేసింది. వైభవ్ సూర్య వంశీ కేవలం 29 బంతులు ఎదుర్కొని 97 పరుగులు సాధించాడు. ఇందులో 12 సిక్సర్లు ఉన్నాయి. మరో ఐదు బౌండరీలు సాధించాడు. 334.48 స్ట్రైక్ రేట్ సాధించి..స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Also Read: Vaibhav-Parag: వైభ‌వ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బ‌య‌ట‌పెట్టిన‌ రియాన్ ప‌రాగ్, ఇదిగో షాకింగ్ వీడియో 

వైభ‌వ్ సూర్య‌వంశీ, ప్రఫుల్ హింగే‌ మ‌ధ్య గొడ‌వ‌

Advertisement

న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సెంచరీ చేసుకునే అవకాశం వచ్చిన నేపథ్యంలో… వైభవ్ సూర్య వంశీకి (Vaibhav Suryavanshi ) హైదరాబాద్ బౌలర్ ప్రఫుల్ హింగే (Praful Hinge) బిగ్ షాక్ ఇచ్చాడు. అద్భుతమైన బంతిని వేసి వైభ‌వ్ ను టెంప్ట్ చేశాడు. ఈ క్రమంలో సామ్రాన్ రవిచంద్రన్ కు క్యాచ్ ఇచ్చి వైభవ్ సూర్యవంశీ 97 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అయితే వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసిన అనంతరం.. హైదరాబాద్ బౌలర్ ప్రఫుల్ హింగే‌ ఓవర్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

వైభవ్ సూర్యవంశీ ముందుకు వెళ్లి ప‌ళ్లు కొరుకుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ప్రఫుల్ హింగే‌. అయితే అది చూసిన వైభవ్ సూర్యవంశీ సీరియస్ అయ్యాడు. ప్రఫుల్ హింగే‌పైకి వెళ్లి దాడికి వైభవ్ సూర్య వంశీ ప్రయత్నించాడు. ఇంతలోనే యశస్వి జైస్వాల్ ఈ గొడ‌వ‌లో జోక్యం చేసుకుని.. వైభవ్ సూర్యవంశీని అక్కడ నుంచి పంపించేశాడు. దీంతో గొడవ అక్కడే ముగిసిపోయింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ అయిన నేపథ్యంలో.. క్రికెట్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. హైదరాబాద్ లోని ఉప్ప‌ల్ వేదిక‌గా మ్యాచ్‌ జరిగినప్పుడు కూడా వైభవ్ సూర్యవంశీని ప్రఫుల్ హింగే‌నే వికెట్ తీయ‌డం గమనార్హం.

SRH ఘోర ఓటమి… క్వాలిఫైయర్ 2లోకి రాజస్థాన్ ఎంట్రీ

Advertisement

న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్   ( SRH Team) దారుణంగా ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ విధించిన 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చేతులెత్తేసింది హైదరాబాద్. 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో హైదరాబాద్ పైన 47 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ విక్టరీతో క్వాలిఫైయర్ రెండో మ్యాచ్ కు రాజస్థాన్ వెళ్లగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంటిదారి పట్టింది. ఇక క్వాలిఫైయర్ రెండో మ్యాచ్ 29వ తేదీ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ మధ్య జరగనుంది. IPL 2026 ఫైనల్స్ మే 31వ తేదీన జరగనుంది.

Also Read:  Abdul Razzaq: PSL అల్లా కంటే ప‌విత్ర‌మైన‌ది..ఐపీఎల్ అతిపెద్ద‌ ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL

 

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×