Bhumi Reaction: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లియా జిల్లాలో తొమ్మిదేళ్ల దళిత బాలికపై ఇద్దరు మైనర్లు జరిపిన లైంగిక దాడికి నిరసనగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి భూమి పెడ్నేకర్ స్పందించిన తీరు నెట్టింట్లో వైరల్ అవుతుంది. కేవలం సానుభూతి ప్రకటనలతో సరిపెట్టకుండా, వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాయ్.
ఎందుకు అప్రమత్తం కావడం లేదన్న భూమి పెడ్నేకర్
బల్లియా జిల్లా హల్దీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో బాధితురాలి గ్రామానికే చెందిన 11 మరియు 12 సంవత్సరాల వయసున్న ఇద్దరు మైనర్లు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడం గమనార్హం. ఈ ఘటనపై భూమి పెడ్నేకర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తీవ్ర అసహనం మరియు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు మన దేశంలో ఏం జరుగుతోందని, మన కళ్ల ముందే పిల్లలకు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు కల్పిస్తున్నామో చూసి కూడా మనం ఎందుకు అప్రమత్తం కావడం లేదని, మనకెందుకు సిగ్గు అనిపించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు.
Also read :‘పెద్ది’ పర్సంటేజీ వివాదానికి మెగా ఎండ్ కార్డ్.. చిరంజీవి ఎంట్రీతో సీన్ రివర్స్!
కేవలం సినిమాల్లో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా
ఈ ఘటనలో కేవలం ఆ తొమ్మిదేళ్ల చిన్నారి మాత్రమే బాధితురాలు కాదని, ఆ ఇద్దరు మైనర్ బాలురు కూడా ఈ కుళ్లిపోయిన చెడిపోయిన సమాజం సృష్టించిన బాధితులేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది మన సామాజిక మానసిక స్థితికి పట్టిన తుప్పుకు నిదర్శనమని ఆమె పెదవి విరిచారు. నిజానికి భూమి పెడ్నేకర్ కేవలం సినిమాల్లో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, సమాజంలో మహిళలపై జరిగే అన్యాయాలపై నిరంతరం గళం విప్పుతూనే ఉంటారు. గతంలో సమాజంలోని మహిళల స్థితిగతులను ప్రతిబింబించేలా ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ప్రశంసలు అందుకున్నాయి.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్స్ లేక మహిళలు పడే ఇబ్బందులపై వచ్చిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ (2017) మరియు మహిళల హక్కుల నేపథ్యంతో వచ్చిన ‘సాండ్ కీ ఆంఖ్’ (2019) లాంటి చిత్రాలు సమాజం పట్ల ఆమెకున్న బాధ్యతని చాటి చెబుతాయి.
దానికి ప్రత్యక్ష ఉదాహరణ
ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక బూతు వీడియోపై కూడా భూమి ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఒక మహిళా గోడ పెయింటింగ్‌ను ఉద్దేశించి ఒక యువకుడు రోడ్డుపై నీచంగా ప్రవర్తించిన తీరును ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. నేటి యువత మానసిక స్థితి ఇంత వికృతంగా తయారైతే, భవిష్యత్తులో వారు సజీవంగా ఉన్న మహిళలు, పిల్లలపై దాడులకు తెగబడటంలో ఆశ్చర్యం లేదని ఆమె అప్పుడే హెచ్చరించారు. ఇప్పుడు బల్లియాలో జరిగిన ఘటనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.
Also read :Big Tv Kissik Talks: కన్నీళ్లు తెప్పిస్తున్న శివ స్టోరీ.. ప్రియాంక జైన్ తో పెళ్లి పై క్లారిటీ…
దేశంలో చట్టాలు ఎన్ని ఉన్నా మహిళలు, చిన్న పిల్లలపై వరుసగా జరుగుతున్న ఇటువంటి దాడులు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం మాటలు, సానుభూతి ప్రకటనలు సరిపోవని, ఇటువంటి వికృత నేరాలను వేళ్లతో సహా తొలగించడానికి కఠినమైన చట్టాలు తీసుకురావాలని మరియు వాటిని తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని భూమి పెడ్నేకర్ గట్టిగా డిమాండ్ చేశారు.
నేరస్తుల వయసుతో నిమిత్తం లేకుండా కఠిన చర్యలు తీసుకున్నప్పుడే భవిష్యత్తు తరాలైనా ప్రశాంతంగా జీవించగలవని నెటిజన్లు సైతం భూమి వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ సెన్సేషనల్ ఇష్యూ ఇప్పుడు దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది.