FIFA World Cup 2026 Final: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంటు (FIFA World Cup 2026 Final ) విజేతగా స్పెయిన్ (Spain) నిలిచింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైన ఈ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. దాదాపు 120 నిమిషాల పాటు కొనసాగిన ఈ మ్యాచ్ లో 1-0 తేడాతో అర్జెంటీనాను (Argentina) చిత్తు చేసి రెండోసారి ఛాంపియన్ అయింది స్పెయిన్. ఎక్స్ ట్రా టైంలో 106వ నిమిషంలో ఫెర్రాన్ టోర్రెస్ గోల్ కొట్టి స్పెయిన్ ను బతికించాడు. ఈ క్రమంలోనే ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో 1-0 తేడాతో స్పెయిన్ విజయం సాధించి, ఛాంపియన్ అయింది. అయితే, 120 నిమిషాల పాటు స్పెయిన్ విజయానికి గోడలా అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ అడ్డుకున్నాడు. లేకపోయి ఉంటే, స్పెయిన్ చేతిలో 10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది.
ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో (FIFA World Cup 2026 Final ) అర్జెంటీనా, స్పెయిన్ (Spain vs Argentina, ) జట్ల మధ్య ఫైనల్స్ జరిగింది. అయితే, ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగగా.. స్పెయిన్ విజేతగా నిలిచింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా కంటే స్పెయిన్ అద్భుతంగా ఆడింది. మ్యాచ్ ప్రారంభమైన నుంచి చివరి వరకు అర్జెంటీనాపై స్పెయిన్ పై చేయి సాధిస్తూనే ఉంది. అర్జెంటినా ప్లేయర్లు ఎవరు సరిగ్గా ఆడలేదు కానీ… ఒక గోల్ కీపర్ మాత్రం స్పెయిన్ విజయాన్ని అడ్డుకున్నాడు. అతడే గోల్ కీపర్ మార్టినెజ్ ( Emiliano Martínez). ఈ ఫైనల్ మ్యాచ్ లో ఏకంగా 10 గోల్స్ మనోడు ఆపాడు. ఆ పది గోల్స్ ఆపకపోయి ఉంటే… అర్జెంటీనాపై 10-0 తేడాతో స్పెయిన్ జట్టు అఖండ విజయాన్ని నమోదు చేసుకునేది. ఈ క్రమంలోనే గోల్ కీపర్ మార్టినెజ్ ను ఫిఫా వరల్డ్ కప్ లో రియల్ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు.
అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకున్నాడు. 1992 సెప్టెంబర్ 2వ తేదీన అర్జెంటీనాలోని ప్లాటా ప్రాంతంలో జన్మించాడు. ఆయన తండ్రి చేపల ట్రక్ డ్రైవర్. తల్లి ఇళ్లల్లో పాచి పని చేస్తూ ఉంటుంది. అలాంటి దయనీయమైన కుటుంబం నుంచి వచ్చిన మార్టినెజ్ … తన చిన్నతనంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. 12 ఏళ్ల వయసులో తన కుటుంబానికి దూరంగా బ్లూనస్ ఐరస్ నగరానికి కూడా వెళ్లాల్సి వచ్చింది. 17 ఏళ్ల వయసులో అంటే 2010లో ఇంగ్లాండ్ కు చెందిన అర్సనల్ ఫుట్ బాల్ క్లబ్ లో మనోడు చేరాడు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి తన 28 సంవత్సరాల వయసులో అర్జెంటీనా జట్టులో చేరాడు. 2024 కోపా అమెరికా టోర్నమెంట్, 2022 ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనాకు వెన్నముకగా పనిచేశాడు.
Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియన్ పోలీసులు !
7 clean sheets. adidas Golden Glove winner. ⭐@adidasfootball pic.twitter.com/mME9QEIgNj
— FIFA World Cup (@FIFAWorldCup) July 20, 2026