E-Paper
Advertisement

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?
Advertisement

Delhi Protest: ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. నీట్ పేపర్ లీకేజీ వివాదంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో, కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం ఉదయం నుంచే వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు, విద్యార్థి సంఘాల నేతలతో జంతర్ మంతర్ పరిసరాలు అట్టుడికాయి. నిరసనకారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో, వారిని అడ్డుకునేందుకు పోలీసులు, ఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగి, పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా సిబ్బంది ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు.

కేంద్ర మంత్రి రాజీనామాకే డిమాండ్
దేశంలో విద్యా వ్యవస్థను అతలాకుతలం చేసిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ ఈ ‘చలో పార్లమెంట్’ పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ, పార్లమెంట్ వైపు సాగుతుండగా పోలీసులు బారికేడ్లు వేసి అడ్డుకున్నారు. ముందస్తు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ, నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Advertisement

దేశ రాజధానిలో హైఅలర్ట్..
ఈ భారీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ముందస్తుగానే కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశ రాజధానిని హైఅలర్ట్ జోన్‌గా ప్రకటించారు. జంతర్ మంతర్ మినహా మిగిలిన అన్ని సున్నిత ప్రాంతాలలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం విధిస్తూ ఆంక్షలు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వందలాది మంది అదనపు బలగాలను మోహరించినప్పటికీ, ఆందోళనకారుల ఉధృతిని తట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో పలువురు నిరసనకారులకు గాయాలైనట్లు సమాచారం.

చర్చలకు మేం సిద్ధం.. నిర్ణయం వారిదే: సీజేపీ
ప్రస్తుత పరిణామాలపై సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందిస్తూ.. “ప్రభుత్వ యంత్రాంగం మాతో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తోంది. వారు చాలా ఆలస్యంగా స్పందించినప్పటికీ, విద్యార్థుల సమస్యలపై మా మనసు విప్పి మాట్లాడటానికి మేం సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ, ఇప్పటివరకు వారి వైపు నుండి ఎలాంటి స్పష్టమైన ప్రతిపాదన రాలేదు. ఇక ముందడుగు వేసి నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే” అని స్పష్టం చేశారు.

Advertisement

నెల రోజులుగా శాంతియుత పోరాటం..
ఈ నిరసనలకు మద్దతుగా ప్రముఖ సామాజిక విప్లవకారుడు సోనమ్ వాంగ్‌చుక్ గత 30 రోజులుగా శాంతియుత రీతిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వ్యవస్థలో మార్పు వచ్చే వరకు ఈ పోరాటం ఆగేది లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నెల రోజులుగా శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమం, తాజా లాఠీఛార్జ్ సంఘటనతో మరింత ఉధృతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

Also Read: రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×