KKR VS LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. అంపైర్ల తప్పుడు నిర్ణయం, వివాదాస్పద క్యాచ్ ఔట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నిన్న డేవిడ్ మిల్లర్ ( David Miller) సింగిల్ తీయకపోవడంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇక ఇవాళ అజింక్య రహానే, ఫిన్ అలెన్ క్యాచ్ ఔట్స్ కూడా వివాదంగా మారాయి. ఈ క్రమంలో కేకేఆర్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also Read: Virender Sehwag: రాసిపెట్టుకోండి…బుమ్రా బౌలింగ్ లో వైభవ్ 6 బంతుల్లో ఆరు సిక్సరు కొడతాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ కేకేఆర్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Kolkata Knight Riders vs Lucknow Super Giants ) మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమైంది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ భారీ స్కోర్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఫిన్ అలెన్ (Finn Allen)… దిగ్వేష్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే బౌండరీ గేటు దగ్గర దిగ్వేష్ సింగ్ ( Digvesh Rathi ) పట్టిన క్యాచ్ వివాదంగా మారింది. బౌండరీ గేటును కాలుతో తొక్కినట్లు ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అయినప్పటికీ అంపైర్లు, దాన్ని చూడకుండా ఔట్ ఇచ్చారని క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటు అజింక్య రహానే ( Rahane Catch) 41 పరుగుల వద్ద మహమ్మద్ షమీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ క్యాచ్ కూడా వివాదంగా మారింది. నేలకు తాకిన తర్వాత మహమ్మద్ షమీ క్యాచ్ అందుకున్నాడని అంటున్నారు. కానీ అంపైర్లు ఇది క్లారిటీగా పరిశీలించకుండా ఔట్ ఇచ్చారని కేకేఆర్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు ఫైర్ అవుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు సాధించింది కేకేఆర్. ఈ క్రమంలో కేవలం నాలుగు వికెట్స్ మాత్రమే కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్ లో 182 పరుగులు సాధిస్తే లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ అందుకుంటుంది. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో కేకేఆర్ ఒక్క విజయాన్ని కూడా నమోదు చేసుకోలేదు. రెండు మ్యాచ్లలో ఓడిపోయిన కేకేఆర్, ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.. ఇవాళ అయినా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
Also Read: Tanveer Ahmed: వైభవ్ పచ్చి మోసగాడు…వాడి ఏజ్ ఒక్కటే కాదు, బ్యాట్లు కూడా చెక్ చేయాల్సిందే
?igsh=MW9uMmxtNmNyaXQ4MA==