E-Paper
Advertisement

పరీక్షలు అయిపోయాయి పీడ వదిలింది.. సొంత వాక్యాల ప్రశ్నలకు క్రేజీ ఆన్సర్స్

పరీక్షలు అయిపోయాయి పీడ వదిలింది.. సొంత వాక్యాల ప్రశ్నలకు క్రేజీ ఆన్సర్స్
Advertisement

Viral Student Answer Sheet: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక విద్యార్థి రాసిన తెలుగు పరీక్షా పత్రం పెద్ద చర్చకు దారితీస్తోంది. పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలో “సొంత వాక్యాలు” రాయమని ఇచ్చిన ప్రశ్నలకు ఆ విద్యార్థి ఇచ్చిన సమాధానాలు నవ్వులు పూయిస్తున్నాయి. సాధారణంగా పరీక్షలు అంటే విద్యార్థుల్లో ఉండే ఒత్తిడి, భయం ఈ సమాధానాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుండగా, అదే సమయంలో విద్యార్థుల ఆలోచనా విధానం, కామెడి టైమింగ్ కూడా బయటపడుతోంది.

ప్రశ్నపత్రంలో “పీడ వదలడం” అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయమని అడిగారు. దానికి ఆ విద్యార్థి ఏమాత్రం తడబడకుండా, మనసులో ఉన్న మాటను బయటపెడుతూ… “పరీక్షలు అయిపోయాయి, పీడ వదిలింది.” అని రాశాడు. కేవలం ఈ ఒక్కటే కాకుండా, “ధ్యాస” అనే పదానికి “చదువు మీద ధ్యాస పెట్టాలి,” అని రాశాడు.

Advertisement

ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఈ పిల్లాడు రాసింది అక్షరాలా నిజం.. పరీక్షలు అయిపోతే ఆ ఫీలింగే వేరు.” అని కొందరు అంటుంటే, “టీచర్ కూడా మార్కులు వేయకుండా ఉండలేకపోయారు.” అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ విద్యార్థికి ఆ రెండు ప్రశ్నలకు కలిపి పూర్తి మార్కులు పడటం విశేషం. మొత్తం 20 మార్కులకు గానూ ఆ విద్యార్థికి 12 మార్కులు వచ్చాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు పడే ఇబ్బందులను, వారి ఆలోచనా ధోరణిని ఈ వైరల్ పిక్ ప్రతిబింబిస్తోంది. ఏది ఏమైనా, ప‌రిక్ష‌లంటే భ‌యం ఎవ‌రికుండ‌దు. ఈ రోజుల్లో విద్యార్థుల‌కు భ‌యంతోపాటు క్రియేటివిటీ కూడా ఎక్కువని ఇలాంటి ఘ‌ట‌న‌లు రుజువు చేస్తున్నాయి. అయితే ఈ ఘ‌ట‌న 2023లో జ‌రిగిన‌ప్ప‌టికీ ప‌రిక్ష‌ల సీజ‌న్ కావ‌డంతో ఈ ఫోటో మ‌రోసారి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Read Also: రైల్వే మన అందరిదీ అంటే ఇలా అర్థమైందా? బ్లాంకెట్లు కాజేసీ.. అమాయకంగా..

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×